Ittumdavaladaa impulunu sompulunu

ఇట్టుండవలదా ఇంపులును సొంపులును
Language

(॥పల్లవి॥)
ఇట్టుండవలదా ఇంపులును సొంపులును
చుట్టమై యీతని మోమే చూచుకొంటా నున్నది

(॥ఇట్టుం॥)
మనసులో కరఁగులు మాటలలో మొరఁగులు
వనితకుఁ జూడరే చేవలుదేరీని
తనివోనికోరికలు తత్తరపుటీరికలు
పెనగొనీ బతిమీఁది ప్రియమెట్టిదో

(॥ఇట్టుం॥)
వీనులనే వినుకులు వెడగోరి చెనకులు
తానకమాయఁ జూడరే తరుణికిని
వూనియున్న మక్కువలు వొద్దనుండే ఇక్కువలు
నానఁబెట్టీ నితనిపై ననుపెట్టిదో

(॥ఇట్టుం॥)
సెలవుల నగవులు చేఁతలలో తగవులు
నెలకొనెఁ జూడరే నెలఁతకును
కలసి రతుల మారుమలసీ వినయములే
పలికీ శ్రీవేంకటేశుపై బత్తి యెట్టిదో

(||pallavi||)
iṭṭuṁḍavaladā iṁpulunu sŏṁpulunu
suṭṭamai yīdani mome sūsugŏṁṭā nunnadi

(||iṭṭuṁ||)
manasulo karam̐gulu māḍalalo mŏram̐gulu
vanidagum̐ jūḍare sevaluderīni
tanivonigorigalu tattarabuḍīrigalu
pĕnagŏnī badimīm̐di priyamĕṭṭido

(||iṭṭuṁ||)
vīnulane vinugulu vĕḍagori sĕnagulu
tānagamāyam̐ jūḍare taruṇigini
vūniyunna makkuvalu vŏddanuṁḍe ikkuvalu
nānam̐bĕṭṭī nidanibai nanubĕṭṭido

(||iṭṭuṁ||)
sĕlavula nagavulu sem̐talalo tagavulu
nĕlagŏnĕm̐ jūḍare nĕlam̐tagunu
kalasi radula mārumalasī vinayamule
paligī śhrīveṁkaḍeśhubai batti yĕṭṭido