Ittumdavaladaa iddari valabulu

ఇట్టుండవలదా ఇద్దరి వలపులు
Language

(॥పల్లవి॥)
ఇట్టుండవలదా ఇద్దరి వలపులు
దట్టమాయ రతితమకము లిపుడు

(॥ఇట్టు॥)
కల గని రమణుఁడు కాంతకుఁ జెప్పఁగ
కలకలనవ్వీఁ గడు నాకె
తలకొని యందేమి తగులఁగ నాడెనో
కలుగఁబోలు నిదె కంటిమి సిగ్గు

(॥ఇట్టు॥)
పొద్దు వోకకత పొలిఁతికిఁ జెప్పఁగ
అద్దలించె మరి యాతనిని
వుద్దండా లందులో నున్నవి యేఁటివో
కద్దుగాఁబోలును కంటిమి సిగ్గు

(॥ఇట్టు॥)
వరుసతో నీతఁడు వావులు చెప్పఁగ
వొరిసి గోరఁ జెలి యూఁదె నిదె
సిరులఁ గూడె నీ శ్రీవేంకటేశుఁడు
కరఁగఁ బోలును కంటిమి సిగ్గు

(||pallavi||)
iṭṭuṁḍavaladā iddari valabulu
daṭṭamāya radidamagamu libuḍu

(||iṭṭu||)
kala gani ramaṇum̐ḍu kāṁtagum̐ jĕppam̐ga
kalagalanavvīm̐ gaḍu nāgĕ
talagŏni yaṁdemi tagulam̐ga nāḍĕno
kalugam̐bolu nidĕ kaṁṭimi siggu

(||iṭṭu||)
pŏddu vogagada pŏlim̐tigim̐ jĕppam̐ga
addaliṁchĕ mari yādanini
vuddaṁḍā laṁdulo nunnavi yem̐ṭivo
kaddugām̐bolunu kaṁṭimi siggu

(||iṭṭu||)
varusado nīdam̐ḍu vāvulu sĕppam̐ga
vŏrisi goram̐ jĕli yūm̐dĕ nidĕ
sirulam̐ gūḍĕ nī śhrīveṁkaḍeśhum̐ḍu
karam̐gam̐ bolunu kaṁṭimi siggu