Ittumdavaddaa padigi needujodaina vanida

ఇట్టుండవద్దా పతికి నీడుజోడైన వనిత
Language

(॥పల్లవి॥)
ఇట్టుండవద్దా పతికి నీడుజోడైన వనిత
మట్టుమీర దెంతైనా సమ్మతి నుండుఁగాని

(॥ఇట్టు॥)
వలచిన కామిని వాసివంతు లెంచదు
చెలరేఁగి చెప్పినట్టు సేసుఁగాని
తలఁపులో మెలఁగేది తనగర్వము చూపడు
నెలకొన్న ప్రియములే నించుఁగాని

(॥ఇట్టు॥)
మరిగిన దెప్పుడును మనసు విరుచుకోదు
తరితీపు దప్పకుండా తగులుఁగాని
సరిఁ బొందుజరపేది సణఁగులు రాల్చదు
కరఁగమాటాడి అలుకలు దేర్చుఁగాని

(॥ఇట్టు॥)
కలపుకోలైనది కడువేసరించదు
పొలసి రతిఁ జవులు పుట్టించుఁగాని
అలమేలుమంగ గూడె నదె శ్రీవేంకటేశ్వరుఁ-
దెలిపి తెలిపి రతిఁ దేలించుఁగాని

(||pallavi||)
iṭṭuṁḍavaddā padigi nīḍujoḍaina vanida
maṭṭumīra dĕṁtainā sammadi nuṁḍum̐gāni

(||iṭṭu||)
valasina kāmini vāsivaṁtu lĕṁchadu
sĕlarem̐gi sĕppinaṭṭu sesum̐gāni
talam̐pulo mĕlam̐gedi tanagarvamu sūbaḍu
nĕlagŏnna priyamule niṁchum̐gāni

(||iṭṭu||)
marigina dĕppuḍunu manasu virusugodu
taridību dappaguṁḍā tagulum̐gāni
sarim̐ bŏṁdujarabedi saṇam̐gulu rālsadu
karam̐gamāḍāḍi alugalu dersum̐gāni

(||iṭṭu||)
kalabugolainadi kaḍuvesariṁchadu
pŏlasi radim̐ javulu puṭṭiṁchum̐gāni
alamelumaṁga gūḍĕ nadĕ śhrīveṁkaḍeśhvarum̐-
dĕlibi tĕlibi radim̐ deliṁchum̐gāni