ఇట్టుండ వలదా నీవు యెవ్వతెకు మోహించినా
(॥పల్లవి॥)
ఇట్టుండ వలదా నీవు యెవ్వతెకు మోహించినా
దట్టముగ నిచ్చితేను తప్పవు నీ బాసలు
(॥ఇట్టుండ॥)
ఆపెమాట లైనా నీవు ఆలకించి మా యింటికి
యీ పొద్దు విచ్చేసితివి యెన్నికె గాను
దాపగు సవతులకు దయ పుట్టఁగాఁ గదా
కాపాడితి విఁక నిన్ను కంటిమి నీ గుణము
(॥ఇట్టుండ॥)
అండ నుండి ఆపె నీకు అప్ప ణియ్యఁగా నైనా
గుండె వట్టి నావద్దఁ గూచుండితివి
దండిగ తోడివారు తగవు నడపఁగాఁగా
నిండ నన్ను మన్నించితి నెగెడె నీ పుణ్యము
(॥ఇట్టుండ॥)
మొక్కిన యాపెమొక్కు మొగిఁ జిత్తానఁ బెట్టైనా
గక్కనఁ గాఁగిటఁ గూడి కైకొంటివి
దిక్కై శ్రీవెంకటేశ యిందిరకు సెలవుగఁగా
మిక్కిలి న న్నేలితివి మెరసె నీ కీరితి
(||pallavi||)
iṭṭuṁḍa valadā nīvu yĕvvadĕgu mohiṁchinā
daṭṭamuga nichchidenu tappavu nī bāsalu
(||iṭṭuṁḍa||)
ābĕmāḍa lainā nīvu ālagiṁchi mā yiṁṭigi
yī pŏddu vichchesidivi yĕnnigĕ gānu
dābagu savadulagu daya puṭṭam̐gām̐ gadā
kābāḍidi vim̐ka ninnu kaṁṭimi nī guṇamu
(||iṭṭuṁḍa||)
aṁḍa nuṁḍi ābĕ nīgu appa ṇiyyam̐gā nainā
guṁḍĕ vaṭṭi nāvaddam̐ gūsuṁḍidivi
daṁḍiga toḍivāru tagavu naḍabam̐gām̐gā
niṁḍa nannu manniṁchidi nĕgĕḍĕ nī puṇyamu
(||iṭṭuṁḍa||)
mŏkkina yābĕmŏkku mŏgim̐ jittānam̐ bĕṭṭainā
gakkanam̐ gām̐giḍam̐ gūḍi kaigŏṁṭivi
dikkai śhrīvĕṁkaḍeśha yiṁdiragu sĕlavugam̐gā
mikkili na nnelidivi mĕrasĕ nī kīridi