ఇట్టివే తనగుణాలు యేల వొడఁబరపించీ
(॥పల్లవి॥)
ఇట్టివే తనగుణాలు యేల వొడఁబరపించీ
ముట్టి కట్టితే వెన్నెల మోపు లయ్యీనా
(॥ఇట్టివే॥)
పరగఁ గప్పురములో పరిమళ మింతే కాక
సరిఁ జవిగొనఁబోతే చప్పనే కాదా
ధరలోఁ దనవలపు తరితీపు లింతే కాక
బెరసి ముద్ద సేసితే బెల్ల మయ్యీనా
(॥ఇట్టివే॥)
మించైన బంగారము మెఱుఁగై తా నుండుఁ గాక
కంచానఁ బెట్టుకొంటే నాఁకలి దీరునా
పంచలఁ దనమాటలు బయలింత లింతే కాక
నించి వాడుకొనఁబోతే నీ రా డయ్యీనా
(॥ఇట్టివే॥)
మాయలపూవుటమ్ములు మర్మము నాటు నింతేకాక
కాయము మీఁదట గంటి గానవచ్చీనా
మా యలమేల్మంగఁ గూడి మరిగె నింతే కాక
యే యెడ శ్రీవేంకటేశుఁ డిచ్చకుఁ డయ్యీనా
(||pallavi||)
iṭṭive tanaguṇālu yela vŏḍam̐barabiṁchī
muṭṭi kaṭṭide vĕnnĕla mobu layyīnā
(||iṭṭive||)
paragam̐ gappuramulo parimaḽa miṁte kāga
sarim̐ javigŏnam̐bode sappane kādā
dharalom̐ danavalabu taridību liṁte kāga
bĕrasi mudda seside bĕlla mayyīnā
(||iṭṭive||)
miṁchaina baṁgāramu mĕṟum̐gai tā nuṁḍum̐ gāga
kaṁchānam̐ bĕṭṭugŏṁṭe nām̐kali dīrunā
paṁchalam̐ danamāḍalu bayaliṁta liṁte kāga
niṁchi vāḍugŏnam̐bode nī rā ḍayyīnā
(||iṭṭive||)
māyalabūvuḍammulu marmamu nāḍu niṁtegāga
kāyamu mīm̐daḍa gaṁṭi gānavachchīnā
mā yalamelmaṁgam̐ gūḍi marigĕ niṁte kāga
ye yĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍichchagum̐ ḍayyīnā