Ittivaani nannu daiva mettu gaasenu

ఇట్టివాని నన్ను దైవ మెట్టు గాచెను
Language

(॥పల్లవి॥)
ఇట్టివాని నన్ను దైవ మెట్టు గాచెను
నట్టనడుమ నిదియే నాకు వెఱగాయెను

(॥ఇట్టి॥)
పరసతి పరధన పరనిందలకు రోయ
యిరవై పెద్దలలోన యెట్టున్నాఁడనో
హరి సేవ గురుసేవ అవియుఁ జేయుట లేదు
సరవి నింకా నేమి చదివేనో

(॥ఇ ట్టి॥)
పాపమును కోపమును పట్టిన చలము మాన
యేపున విజ్ఞాని నంటా యేమి సేసేనో
పై పై సన్మార్గము పట్టదు నా మతిలోన
దాపగు తత్త్వము నెట్టు తలపోసెనో

(॥ఇట్టి॥)
మోహమును దాహమును ముందు వెనకా నెఱుఁగ
ఆహా విరక్తుఁడ నే ననుట యెట్టు
వోహో శ్రీ వేంకటేశుఁ డొలిసి మన్నించెఁ గాక
సాహసించి నే నెట్టు శరణంటినో

(||pallavi||)
iṭṭivāni nannu daiva mĕṭṭu gāsĕnu
naṭṭanaḍuma nidiye nāgu vĕṟagāyĕnu

(||iṭṭi||)
parasadi paradhana paraniṁdalagu roya
yiravai pĕddalalona yĕṭṭunnām̐ḍano
hari seva guruseva aviyum̐ jeyuḍa ledu
saravi niṁkā nemi sadiveno

(||i ṭṭi||)
pābamunu kobamunu paṭṭina salamu māna
yebuna vijñāni naṁṭā yemi seseno
pai pai sanmārgamu paṭṭadu nā madilona
dābagu tattvamu nĕṭṭu talabosĕno

(||iṭṭi||)
mohamunu dāhamunu muṁdu vĕnagā nĕṟum̐ga
āhā viraktum̐ḍa ne nanuḍa yĕṭṭu
voho śhrī veṁkaḍeśhum̐ ḍŏlisi manniṁchĕm̐ gāga
sāhasiṁchi ne nĕṭṭu śharaṇaṁṭino