ఇట్టిజీవుల కింక నేది వాటి
(॥పల్లవి॥)
ఇట్టిజీవుల కింక నేది వాటి
దట్టమై దేవుఁడ నీవే దయఁజూతు గాకా
(॥ఇట్టి॥)
తనజన్మవిదు(ధు )లనుఁ దలఁచు నొక్కొకవేళ
వొనర మఱచునట్టె వొక్కొకవేళ
వినుఁ బురాణకథలు వివరించి యొకవేళ
పెనచి సందేహములె పెంచు నొకవేళ
(॥ఇట్టి॥)
విసిగి సంసారమందు విరతుఁడౌ నొకవేళ
వొఁసగి యందె మత్తుఁడౌ నొకవేళ
పసిగొని యింద్రియాల బంటై వుండు నొకవేళ
ముసిపితో దైవానకు మొక్కు నొక్కవేళ
(॥ఇట్టి॥)
కోరి తపములు చేసి గుణియౌ తా నొకవేళ
వూరకే అలసి వుండు నొక్కవేళ
యీరీతి శ్రీవేంకటేశ యెదలో నీవుండఁగాను
బీరాన నీకే మొఱవెట్టు నొకవేళ
(||pallavi||)
iṭṭijīvula kiṁka nedi vāḍi
daṭṭamai devum̐ḍa nīve dayam̐jūdu gāgā
(||iṭṭi||)
tanajanmavidu(dhu )lanum̐ dalam̐su nŏkkŏgaveḽa
vŏnara maṟasunaṭṭĕ vŏkkŏgaveḽa
vinum̐ burāṇagathalu vivariṁchi yŏgaveḽa
pĕnasi saṁdehamulĕ pĕṁchu nŏgaveḽa
(||iṭṭi||)
visigi saṁsāramaṁdu viradum̐ḍau nŏgaveḽa
vŏm̐sagi yaṁdĕ mattum̐ḍau nŏgaveḽa
pasigŏni yiṁdriyāla baṁṭai vuṁḍu nŏgaveḽa
musibido daivānagu mŏkku nŏkkaveḽa
(||iṭṭi||)
kori tabamulu sesi guṇiyau tā nŏgaveḽa
vūrage alasi vuṁḍu nŏkkaveḽa
yīrīdi śhrīveṁkaḍeśha yĕdalo nīvuṁḍam̐gānu
bīrāna nīge mŏṟavĕṭṭu nŏgaveḽa