ఇట్టిదివో నాగుణము యెరిఁగివుందువు గాని
(॥పల్లవి॥)
ఇట్టిదివో నాగుణము యెరిఁగివుందువు గాని
గుట్టుతోడ నుందుఁగాని కొసర నిన్నెపుడు
(॥॥)
యీసడించనోపఁగాని ఇచ్చలాడఁ జాలుదును
సేసిన రేపల్లెలోని సేఁతలకును
ఆసగించవచ్చుఁగాని ఆదరించరాదు నిన్ను
వేసాలగందమువారి వెలఁదిపొందులకు
(॥॥)
నిందలాడఁజాలఁగాని నిన్ను మెప్పించఁగలను
అందపునీమధురలో ఆసుద్దులకు
మందటాడ నేమిటికి మచ్చిక సేయఁదగును
అంది పదురువేలఁ బెండ్లాడినందుకు
(॥॥)
కాదననేరఁగాని కలయఁగనేర్తును
సోదించి నీకొలనిలోసుద్దులు విని
సాదించి శ్రీవేంకటేశ చనవిచ్చి నన్నే లితి-
వాదరించు టొప్పుఁగాని అలఇంచ కిఁకను
(||pallavi||)
iṭṭidivo nāguṇamu yĕrim̐givuṁduvu gāni
guṭṭudoḍa nuṁdum̐gāni kŏsara ninnĕbuḍu
(||||)
yīsaḍiṁchanobam̐gāni ichchalāḍam̐ jāludunu
sesina reballĕloni sem̐talagunu
āsagiṁchavachchum̐gāni ādariṁcharādu ninnu
vesālagaṁdamuvāri vĕlam̐dibŏṁdulagu
(||||)
niṁdalāḍam̐jālam̐gāni ninnu mĕppiṁcham̐galanu
aṁdabunīmadhuralo āsuddulagu
maṁdaḍāḍa nemiḍigi machchiga seyam̐dagunu
aṁdi paduruvelam̐ bĕṁḍlāḍinaṁdugu
(||||)
kādananeram̐gāni kalayam̐ganerdunu
sodiṁchi nīgŏlanilosuddulu vini
sādiṁchi śhrīveṁkaḍeśha sanavichchi nanne lidi-
vādariṁchu ṭŏppum̐gāni ala̮iṁcha kim̐kanu