Ittidi vo neemahima yemani pogademayya

ఇట్టిది వో నీమహిమ యేమని పొగడేమయ్య
Language

(॥పల్లవి॥)
ఇట్టిది వో నీమహిమ యేమని పొగడేమయ్య
తిట్టినాను మోవిమీఁద తేనెలే తొరుగవా

(॥ఇట్టి॥)
జలజాక్షితో నీవు సరసములాడఁగాను
చెలరేఁగి చెక్కులెల్లఁ జెమరించెను
మొలకచన్నులు నీవు ముట్టితేఁగనక ఇఁక
వలపెల్ల జడివట్టి వానలై కురియవా

(॥ఇట్టి॥)
మచ్చికల నీకెతోను మాటలునీవాడఁగాను
కచ్చుపెట్టివులకలుకడునిండెను
అచ్చుగాఁ గాఁగిట నించి యము లంటితే నిఁక
పచ్చికోరికలెల్లాను పాలుకొని పండవా

(॥ఇట్టి॥)
చెనకుచు నవ్వులనె సేసలు నీవు వెట్టంగ
గనియై మోముననిండుఁగళ లుబ్బెను
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విపుడింకా
చనవులు తీపులెక్క చవులుముదురవా

(||pallavi||)
iṭṭidi vo nīmahima yemani pŏgaḍemayya
tiṭṭinānu movimīm̐da tenĕle tŏrugavā

(||iṭṭi||)
jalajākṣhido nīvu sarasamulāḍam̐gānu
sĕlarem̐gi sĕkkulĕllam̐ jĕmariṁchĕnu
mŏlagasannulu nīvu muṭṭidem̐ganaga im̐ka
valabĕlla jaḍivaṭṭi vānalai kuriyavā

(||iṭṭi||)
machchigala nīgĕdonu māḍalunīvāḍam̐gānu
kachchubĕṭṭivulagalugaḍuniṁḍĕnu
achchugām̐ gām̐giḍa niṁchi yamu laṁṭide nim̐ka
pachchigorigalĕllānu pālugŏni paṁḍavā

(||iṭṭi||)
sĕnagusu navvulanĕ sesalu nīvu vĕṭṭaṁga
ganiyai momunaniṁḍum̐gaḽa lubbĕnu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi vibuḍiṁkā
sanavulu tībulĕkka savulumuduravā