Ittidi kaalamahima imkanela maramgu

ఇట్టిది కాలమహిమ ఇఁకనేల మరఁగు
Language

(॥పల్లవి॥)
ఇట్టిది కాలమహిమ ఇఁకనేల మరఁగు
గుట్టుదెలిసినవారు కూడఁ జెప్పఁ గదరె

(॥ఇట్టి॥)
నంటున జక్కవలపై నల్లఁబులుగులు వాలె
అంటి తామరాఁ జిగురూ నల్లిబెల్లేయ
పెంటతుమ్మిదలపై పిచ్చిలఁ బాలు గురిపె
జుంటితేనె దొండపండు చూరలాడెను

(॥ఇట్టి॥)
వెదకి చిలుకలూఁ గోవిలలూఁ జీరుమూరాడె
గుదిఁ జంద్రశకలాలఁ గూర్మ మెక్కెను
చెదరి యుద్దములలో చీఁకటి తీగెలువారె
పొదిగెఁ గారుమెఱుఁగుఁ బువ్వులదండలు

(॥ఇట్టి॥)
పువ్వుమీఁది వాసనకుఁ బొంచి డాసెను మొయిలు
కువ్వలై మరురాజ్యము కొటారుకెక్కె
మవ్వపుటలమేల్మంగమగఁడు శ్రీవేంకటేశు-
నివ్వల నడిగి మాకు నెరిఁగించరే

(||pallavi||)
iṭṭidi kālamahima im̐kanela maram̐gu
guṭṭudĕlisinavāru kūḍam̐ jĕppam̐ gadarĕ

(||iṭṭi||)
naṁṭuna jakkavalabai nallam̐bulugulu vālĕ
aṁṭi tāmarām̐ jigurū nallibĕlleya
pĕṁṭadummidalabai pichchilam̐ bālu guribĕ
juṁṭidenĕ dŏṁḍabaṁḍu sūralāḍĕnu

(||iṭṭi||)
vĕdagi silugalūm̐ govilalūm̐ jīrumūrāḍĕ
gudim̐ jaṁdraśhagalālam̐ gūrma mĕkkĕnu
sĕdari yuddamulalo sīm̐kaḍi tīgĕluvārĕ
pŏdigĕm̐ gārumĕṟum̐gum̐ buvvuladaṁḍalu

(||iṭṭi||)
puvvumīm̐di vāsanagum̐ bŏṁchi ḍāsĕnu mŏyilu
kuvvalai marurājyamu kŏḍārugĕkkĕ
mavvabuḍalamelmaṁgamagam̐ḍu śhrīveṁkaḍeśhu-
nivvala naḍigi māgu nĕrim̐giṁchare