Itti vatti vesaalu yemtaseseve

ఇట్టి వట్టి వేసాలు యెంతసేసేవే
Language

(॥పల్లవి॥)
ఇట్టి వట్టి వేసాలు యెంతసేసేవే
పట్టితే బలువుకొద్ది పంతమౌతెఱఁగవా

(॥॥)
నీ మగని వద్ద నేను నిలుచుండితినంటాను
యేమే సాదించవచ్చే వెంతపగటే
ఆముకొని యేపొద్దూ నీతనినీపై మోహము
మే మెఱఁ గకుండా నీకే మీఁదుకట్టి వున్నదా

(॥॥)
మనసిచ్చి యాతనితో మాటలాడితినంటా
కనువిచ్చి చూచే వెంతకాఁ తాళమే
యెనయ నాతనికాఁగి లిందరులుఁ జూడఁగాను
తనివార నీకుఁ గానే దాఁచఁ బెట్టి వున్నదా

(॥॥)
యెలమి నేను శ్రీవేంకటేశుఁ గూడితినంటా
అలరి సోదించే వెంత ఆసకత్తెవే
అలమేలుమంగపతి యతనిచుట్టరికము
పలుమారు నీకెప్పుడఁ బాలువెట్టివున్నదా

(||pallavi||)
iṭṭi vaṭṭi vesālu yĕṁtaseseve
paṭṭide baluvugŏddi paṁtamaudĕṟam̐gavā

(||||)
nī magani vadda nenu nilusuṁḍidinaṁṭānu
yeme sādiṁchavachche vĕṁtabagaḍe
āmugŏni yebŏddū nīdaninībai mohamu
me mĕṟam̐ gaguṁḍā nīge mīm̐dugaṭṭi vunnadā

(||||)
manasichchi yādanido māḍalāḍidinaṁṭā
kanuvichchi sūse vĕṁtagām̐ tāḽame
yĕnaya nādanigām̐gi liṁdarulum̐ jūḍam̐gānu
tanivāra nīgum̐ gāne dām̐sam̐ bĕṭṭi vunnadā

(||||)
yĕlami nenu śhrīveṁkaḍeśhum̐ gūḍidinaṁṭā
alari sodiṁche vĕṁta āsagattĕve
alamelumaṁgabadi yadanisuṭṭarigamu
palumāru nīgĕppuḍam̐ bāluvĕṭṭivunnadā