Itti valabulu tala kekkem gaa neegu

ఇట్టి వలపులు తల కెక్కెఁ గా నీకు
Language

(॥పల్లవి॥)
ఇట్టి వలపులు తల కెక్కెఁ గా నీకు
పెట్టరాని మందు లెల్లఁ బెట్టెఁ గా నీకు

(॥ఇట్టి॥)
కోపగించి కన్నులనె కొసరుచుఁ దిట్టఁగాను
ఆపెతోడిమాట లిత వాయఁగా నీకు
పో పో కొంగు వీడు మని పోరఁగానె యాపెతోడ
పూపనవ్వు నవ్వ బుద్ది వుట్టెఁ గా నీకు

(॥ఇట్టి॥)
పిలువఁ బిలువఁ గానె బిగిసేయాపెతోడ
బలిమిఁ బట్టి పెనఁగ బాఁతిగా నీకు
తల మొల వీడఁగాను తప్పించుకొనేయాపెకు
యెలమిఁ దమ్మ వెట్టేదే యింపుగా నీకు

(॥ఇట్టి॥)
చెక్కుచేతిసిగ్గుతోడ సిరసు వంచినయాపె
కక్కసపురతులు సంగతిగా నీకూ
అక్కర శ్రీవెంకటేశ అలమేలుమంగ నని
వొక్క టయితి విది మతి నుండెఁ గా నీకూ

(||pallavi||)
iṭṭi valabulu tala kĕkkĕm̐ gā nīgu
pĕṭṭarāni maṁdu lĕllam̐ bĕṭṭĕm̐ gā nīgu

(||iṭṭi||)
kobagiṁchi kannulanĕ kŏsarusum̐ diṭṭam̐gānu
ābĕdoḍimāḍa lida vāyam̐gā nīgu
po po kŏṁgu vīḍu mani poram̐gānĕ yābĕdoḍa
pūbanavvu navva buddi vuṭṭĕm̐ gā nīgu

(||iṭṭi||)
piluvam̐ biluvam̐ gānĕ bigiseyābĕdoḍa
balimim̐ baṭṭi pĕnam̐ga bām̐tigā nīgu
tala mŏla vīḍam̐gānu tappiṁchugŏneyābĕgu
yĕlamim̐ damma vĕṭṭede yiṁpugā nīgu

(||iṭṭi||)
sĕkkusedisiggudoḍa sirasu vaṁchinayābĕ
kakkasaburadulu saṁgadigā nīgū
akkara śhrīvĕṁkaḍeśha alamelumaṁga nani
vŏkka ṭayidi vidi madi nuṁḍĕm̐ gā nīgū