ఇట్టి ప్రతాపము గల యీతని దాసుల నెల్ల
(॥పల్లవి॥)
ఇట్టి ప్రతాపము గల యీతని దాసుల నెల్ల
కట్టు నా కర్మములెల్ల గాలిఁ బోవుఁ గాక
(॥ఇట్టి॥)
యెలమిఁ జక్రాయుధున కెదురా దానవులు
తొలఁగ కెందుచొచ్చినఁ దుండించుఁ గాక
ఇల గరుడధ్వజు పై నెక్కునా విషములు
కలఁగి నీరై పారి గాలిఁ బోవుఁ గాక
(॥ఇట్టి॥)
గోవర్ధనధరునిపై కొలుపునా మాయలు
వేవేలు దునుకలై విరుగుఁగాక
కేవలుఁ డచ్యుతునొద్దఁ గీడు చూపఁగలవా
కావరమై తాఁ దానె గాలిఁ బోవుఁ గాక
(॥ఇట్టి॥)
వీరనారసింహునకు వెరపులు గలవా
దూరాన గగ్గులకాడై తొలఁగుఁ గాక
కోరి యీ శ్రీవేంకటేశుఁ గొలిచితి మిదివో
కారుకొన్న పగలెల్ల గాలిఁ బోవుఁ గాక
(||pallavi||)
iṭṭi pradābamu gala yīdani dāsula nĕlla
kaṭṭu nā karmamulĕlla gālim̐ bovum̐ gāga
(||iṭṭi||)
yĕlamim̐ jakrāyudhuna kĕdurā dānavulu
tŏlam̐ga kĕṁdusŏchchinam̐ duṁḍiṁchum̐ gāga
ila garuḍadhvaju pai nĕkkunā viṣhamulu
kalam̐gi nīrai pāri gālim̐ bovum̐ gāga
(||iṭṭi||)
govardhanadharunibai kŏlubunā māyalu
vevelu dunugalai virugum̐gāga
kevalum̐ ḍachyudunŏddam̐ gīḍu sūbam̐galavā
kāvaramai tām̐ dānĕ gālim̐ bovum̐ gāga
(||iṭṭi||)
vīranārasiṁhunagu vĕrabulu galavā
dūrāna gaggulagāḍai tŏlam̐gum̐ gāga
kori yī śhrīveṁkaḍeśhum̐ gŏlisidi midivo
kārugŏnna pagalĕlla gālim̐ bovum̐ gāga