Itti padido vesaa limkanele

ఇట్టి పతితో వేసా లింకనేలే
Language

(॥పల్లవి॥)
ఇట్టి పతితో వేసా లింకనేలే
చుట్టరికములే నీతోఁ జూచుకొనఁ గదవే

(॥ఇట్టి॥)
చెక్కులు నొక్కఁగాను చేయివట్టి తియ్యఁగాను
యెక్కుడుగాఁ బెనఁగేవు ఇదియేమే
యిక్కువ లంటఁగాను ఇయ్యకోళ్లు సేయఁగాను
మొక్కు మొక్కి కరఁగవు ముంచి నీవదేమే

(॥ఇట్టి॥)
మంచిమాట లాడఁగాను మచ్చికలు చూపఁగాను
యెంచుకోనేవు నేలలే ఇదియేమే
కంచపు మోవియ్యఁగాను కాఁగిలించుకొనఁగాను
ఇంచుకంత నవ్వు నవ్వి యెనయ విధేమే

(॥ఇట్టి॥)
పంతము లియ్యఁగాను బాసలెల్లఁ జేయఁగాను
యెంతైనాఁ గొసరేవు ఇదియేమే
వింతగా బుజ్జగించి శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను
దొంతిరతిఁ దనియవు తోడనే ఇదేమే

(||pallavi||)
iṭṭi padido vesā liṁkanele
suṭṭarigamule nīdom̐ jūsugŏnam̐ gadave

(||iṭṭi||)
sĕkkulu nŏkkam̐gānu seyivaṭṭi tiyyam̐gānu
yĕkkuḍugām̐ bĕnam̐gevu idiyeme
yikkuva laṁṭam̐gānu iyyagoḽlu seyam̐gānu
mŏkku mŏkki karam̐gavu muṁchi nīvademe

(||iṭṭi||)
maṁchimāḍa lāḍam̐gānu machchigalu sūbam̐gānu
yĕṁchugonevu nelale idiyeme
kaṁchabu moviyyam̐gānu kām̐giliṁchugŏnam̐gānu
iṁchugaṁta navvu navvi yĕnaya vidheme

(||iṭṭi||)
paṁtamu liyyam̐gānu bāsalĕllam̐ jeyam̐gānu
yĕṁtainām̐ gŏsarevu idiyeme
viṁtagā bujjagiṁchi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu
dŏṁtiradim̐ daniyavu toḍane ideme