ఇట్టి నీ మగని సుద్దు లెంతని చెప్పేమమ్మ
(॥పల్లవి॥)
ఇట్టి నీ మగని సుద్దు లెంతని చెప్పేమమ్మ
వొట్టుకొని వురముపై నుండవమ్మ ఇఁకను
(॥ఇటి॥)
కలికి తనపు నీకనుచూపు లంటాను
కలవ దండలు మేనఁ గప్పకొనును
పలచని మోవితేనె పలుకులేయంటాను
చిలుకలు సారెసారెఁ జేరి మాఁటాడించును
(॥ఇటి॥)
చక్కని నీ సొబగైన నీచనుగుబ్బలంటాను
పక్కన నిమ్మపండు చేఁబట్టి చూచును
అక్కజమయిన నీయందపుఁ జేఁతలంటాను
నిక్కి నిక్కి యద్దములు నీడలు చూచును
(॥ఇటి॥)
నినుపుఁ గాంతులతోడి నీ కొప్ప నెరులంటా
మునుకొని నీలాలసొమ్ములే పెట్టును
యెనసె నిన్ను శ్రీవేంకటేశుఁ డిట్టె యిందాఁకా
నిను వ్రాసిన రూపము నీవంటా మాఁటాడును
(||pallavi||)
iṭṭi nī magani suddu lĕṁtani sĕppemamma
vŏṭṭugŏni vuramubai nuṁḍavamma im̐kanu
(||iḍi||)
kaligi tanabu nīganusūbu laṁṭānu
kalava daṁḍalu menam̐ gappagŏnunu
palasani movidenĕ paluguleyaṁṭānu
silugalu sārĕsārĕm̐ jeri mām̐ṭāḍiṁchunu
(||iḍi||)
sakkani nī sŏbagaina nīsanugubbalaṁṭānu
pakkana nimmabaṁḍu sem̐baṭṭi sūsunu
akkajamayina nīyaṁdabum̐ jem̐talaṁṭānu
nikki nikki yaddamulu nīḍalu sūsunu
(||iḍi||)
ninubum̐ gāṁtuladoḍi nī kŏppa nĕrulaṁṭā
munugŏni nīlālasŏmmule pĕṭṭunu
yĕnasĕ ninnu śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ yiṁdām̐kā
ninu vrāsina rūbamu nīvaṁṭā mām̐ṭāḍunu