ఇట్టి గుణవంతురాలు యీ యలమేల్మంగ
(॥పల్లవి॥)
ఇట్టి గుణవంతురాలు యీ యలమేల్మంగ
గుట్టు గలదానికి కోరికె ఫలించును
(॥ఇట్టి॥)
వోరుపు గలదానికి వొనరు దొరతనము
నేరుపు గలదానికి నిండు సిరులు
మేరతో నున్నదానికి మిక్కిలి కీర్తి గలుగు
భారీతనముదానికి పరు లెల్లాఁ జుట్టాలే
(॥ఇట్టి॥)
ప్రియము గలదానికి పెనగొను సౌఖ్యములు
నయము గలదానికి నమ్ములోకము
దయ గలదానికి దైవమైనాఁ దోడౌను
నియతి గలదానికి నెఱవేఱుఁ బనులు
(॥ఇట్టి॥)
తగవరైనదానికి తగులై యుండు జయము
మొగమోటదానికి మోహించుఁ బతి
నిగిడి శ్రీవేంకటేశ నీ కిన్నిటా నీకె గలిగె
తగులైనదానికి తప్పదు నీ కరుణ
(||pallavi||)
iṭṭi guṇavaṁturālu yī yalamelmaṁga
guṭṭu galadānigi korigĕ phaliṁchunu
(||iṭṭi||)
vorubu galadānigi vŏnaru dŏradanamu
nerubu galadānigi niṁḍu sirulu
merado nunnadānigi mikkili kīrdi galugu
bhārīdanamudānigi paru lĕllām̐ juṭṭāle
(||iṭṭi||)
priyamu galadānigi pĕnagŏnu saukhyamulu
nayamu galadānigi nammulogamu
daya galadānigi daivamainām̐ doḍaunu
niyadi galadānigi nĕṟaveṟum̐ banulu
(||iṭṭi||)
tagavarainadānigi tagulai yuṁḍu jayamu
mŏgamoḍadānigi mohiṁchum̐ badi
nigiḍi śhrīveṁkaḍeśha nī kinniḍā nīgĕ galigĕ
tagulainadānigi tappadu nī karuṇa