ఇట్టె వూడిగపువారు యెందరు లేరు
(॥పల్లవి॥)
ఇట్టె వూడిగపువారు యెందరు లేరు
ఱట్టు సేయఁబోతే నాఱడి యవును
(॥ఇట్టె॥)
మోము చూచి పడి మోహము నీపైఁ జల్లేటి
కామిను లెందరు లేరు కన్న చోటను
నీమన సెఱఁగానా నీ వేల సిగ్గుపడేవు
యీ మెలుఁతవద్ద నుంటే యేల వచ్చీ నిందలు
(॥ఇట్టె॥)
సరసమాడి నవ్వుతా చనవులు మెరసేటిఁ
తరుణు లెందరు లేరు దగ్గ రుండను
యిర వెల్ల నెరఁగనా యేల చిన్నఁ బోయేవు
పెరుపేరటాం డ్లెల్లా పెండ్లికూఁతు లౌదురా
(॥ఇట్టె॥)
వీడె మిచ్చి మాటాడుతా విందులు చెప్ప వచ్చినఁ
చేడె లెందరు లేరు నీ సేవలు సేయను
యీడనే శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
వాడలోనిసతులపై వావిమోపఁ దగునా
(||pallavi||)
iṭṭĕ vūḍigabuvāru yĕṁdaru leru
ṟaṭṭu seyam̐bode nāṟaḍi yavunu
(||iṭṭĕ||)
momu sūsi paḍi mohamu nībaim̐ jalleḍi
kāminu lĕṁdaru leru kanna soḍanu
nīmana sĕṟam̐gānā nī vela siggubaḍevu
yī mĕlum̐tavadda nuṁṭe yela vachchī niṁdalu
(||iṭṭĕ||)
sarasamāḍi navvudā sanavulu mĕraseḍim̐
taruṇu lĕṁdaru leru dagga ruṁḍanu
yira vĕlla nĕram̐ganā yela sinnam̐ boyevu
pĕruberaḍāṁ ḍlĕllā pĕṁḍligūm̐tu laudurā
(||iṭṭĕ||)
vīḍĕ michchi māḍāḍudā viṁdulu sĕppa vachchinam̐
seḍĕ lĕṁdaru leru nī sevalu seyanu
yīḍane śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
vāḍalonisadulabai vāvimobam̐ dagunā