Itte vogadogadeyela gadimchugonevu

ఇట్టె వొకటొకటేయేల గడించుకొనేవు
Language

(॥పల్లవి॥)
ఇట్టె వొకటొకటేయేల గడించుకొనేవు
జట్టిగొన్నమేలు మీఁది జాణలే మీరిద్దరూ

(॥ట్టె॥)
చుట్టములైనవారు సొలయుచుందురుగాక
బట్టబయలు పంతాలు పచారించేరా
గుట్టునఁ బాదాలొత్తఁగా కుచములు దాఁకెఁగాక
దిట్టతనమున నీతో దీకొనెవా

(॥ట్టె॥)
ప్రేమగలవారు పట్టిపెనగుచుందురుగాక
దీమసానఁ జలము సాదించనేర్తురా
గొమునఁ గొప్పువెట్టఁగా గోరు చెక్కుసొఁకెఁగాక
గామిడితనాన నీతో గయ్యాళించెనా

(॥ట్టె॥)
పాలుగలవారు రతిఁ బాయకవుందురుగాక
అలరిచేతలు సేసి అలయింతురా
యీలీల నలమేల్‌మంగ యీకె శ్రీవేంకటేశ్వర
యేలితివి యీకె నీతో నెదురాడెనా

(||pallavi||)
iṭṭĕ vŏgaḍŏgaḍeyela gaḍiṁchugŏnevu
jaṭṭigŏnnamelu mīm̐di jāṇale mīriddarū

(||ṭṭĕ||)
suṭṭamulainavāru sŏlayusuṁdurugāga
baṭṭabayalu paṁtālu pasāriṁcherā
guṭṭunam̐ bādālŏttam̐gā kusamulu dām̐kĕm̐gāga
diṭṭadanamuna nīdo dīgŏnĕvā

(||ṭṭĕ||)
premagalavāru paṭṭibĕnagusuṁdurugāga
dīmasānam̐ jalamu sādiṁchanerdurā
gŏmunam̐ gŏppuvĕṭṭam̐gā goru sĕkkusŏm̐kĕm̐gāga
gāmiḍidanāna nīdo gayyāḽiṁchĕnā

(||ṭṭĕ||)
pālugalavāru radim̐ bāyagavuṁdurugāga
alarisedalu sesi alayiṁturā
yīlīla nalamel‌maṁga yīgĕ śhrīveṁkaḍeśhvara
yelidivi yīgĕ nīdo nĕdurāḍĕnā