ఇట్టె విన్నవించరే ఇంతులెల్లా నాతనితో
(॥పల్లవి॥)
ఇట్టె విన్నవించరే ఇంతులెల్లా నాతనితో
దట్టమైన నా వలపు తానే యెరుఁగును
(॥ఇట్టె॥)
కన్నుచూపుల నున్నవి కాంక్షలు
చన్నులపై నున్నది జవ్వనము
సన్నలలోనే వున్నవి సరసములు
యెన్నరాని నావలపు యేమని చెప్పుదునే
(॥ఇట్టె॥)
పెదవిపై నున్నవి ప్రియములు
మదిలోన నున్నవి మమతలు
పొదిలి మేన నున్నవి పులకలు
యెదుటి నావలపులు యేమని చెప్పుదునే
(॥ఇట్టె॥)
చెక్కులపై నున్నవి చెమటలు
మొక్కులలో నున్నవి ముదములు
వొక్కటై శ్రీవేంకటేశుఁ డున్నాఁడు తానె కాఁగిట
యిక్కువ నావలపులు యేమని చెప్పుదునే
(||pallavi||)
iṭṭĕ vinnaviṁchare iṁtulĕllā nādanido
daṭṭamaina nā valabu tāne yĕrum̐gunu
(||iṭṭĕ||)
kannusūbula nunnavi kāṁkṣhalu
sannulabai nunnadi javvanamu
sannalalone vunnavi sarasamulu
yĕnnarāni nāvalabu yemani sĕppudune
(||iṭṭĕ||)
pĕdavibai nunnavi priyamulu
madilona nunnavi mamadalu
pŏdili mena nunnavi pulagalu
yĕduḍi nāvalabulu yemani sĕppudune
(||iṭṭĕ||)
sĕkkulabai nunnavi sĕmaḍalu
mŏkkulalo nunnavi mudamulu
vŏkkaḍai śhrīveṁkaḍeśhum̐ ḍunnām̐ḍu tānĕ kām̐giḍa
yikkuva nāvalabulu yemani sĕppudune