Itte vichchesee nadamdele yimta

ఇట్టే విచ్చేసీ నతఁడేలే యింత
Language

(॥పల్లవి॥)
ఇట్టే విచ్చేసీ నతఁడేలే యింత
వొట్టి వూరకున్నవారి నుడికించ నేఁటికే

(॥ఇట్టే॥)
కప్పుర మంపెఁగదే కాంతుఁడు తారానిఁ
కప్పురము వేఁడిచల్లీఁ గదవే నాకు
దప్పికిఁ బన్నీరంపెఁ దమితో నీకు
నిప్పులను బొరలించి నీకు చల్లనేఁటికే

(॥ఇట్టే॥)
గంద మంపెఁగదె నీకు ఘనుఁడు తా రానిఁ
గందమా అది పెద్దగండము గాక
ముందరనే పువ్వులంపె ముడుచుకోవే
విందుగాఁ గాఁకలు చల్లి విసరఁగనేఁటికే

(॥ఇట్టే॥)
వుంగర మంపెఁగదవే వువిద, తా రాకున్న
వుంగరమా అది నాకు వుంకువగాక
కంగి కూడె శ్రీ వెంకటఘనుఁడు కడపలోన
నింగు(?)నెండలోనఁ బెట్టి నీడకుఁ దియ్యనేలే

(||pallavi||)
iṭṭe vichchesī nadam̐ḍele yiṁta
vŏṭṭi vūragunnavāri nuḍigiṁcha nem̐ṭige

(||iṭṭe||)
kappura maṁpĕm̐gade kāṁtum̐ḍu tārānim̐
kappuramu vem̐ḍisallīm̐ gadave nāgu
dappigim̐ bannīraṁpĕm̐ damido nīgu
nippulanu bŏraliṁchi nīgu sallanem̐ṭige

(||iṭṭe||)
gaṁda maṁpĕm̐gadĕ nīgu ghanum̐ḍu tā rānim̐
gaṁdamā adi pĕddagaṁḍamu gāga
muṁdarane puvvulaṁpĕ muḍusugove
viṁdugām̐ gām̐kalu salli visaram̐ganem̐ṭige

(||iṭṭe||)
vuṁgara maṁpĕm̐gadave vuvida, tā rāgunna
vuṁgaramā adi nāgu vuṁkuvagāga
kaṁgi kūḍĕ śhrī vĕṁkaḍaghanum̐ḍu kaḍabalona
niṁgu(?)nĕṁḍalonam̐ bĕṭṭi nīḍagum̐ diyyanele