ఇట్టె వీడె మందుకోవు యెందాఁకాను
(॥పల్లవి॥)
ఇట్టె వీడె మందుకోవు యెందాఁకాను
పట్టపగలే వచ్చితి పరాకేఁటి కోయి
(॥ఇట్టె॥)
కంటికి నిద్దుర రాక కాచుకుందాన నీరాక
యింటికి రా వే మోయి యెందాఁకనూ
జంట లైనసతులతో జాణతనా లాడఁ బట్టె
వెంటనే తిరుగ కనువేళ గాన నోయీ
(॥ఇట్టె॥)
నెయ్యమున విందు చెప్పి నే నీకు మొక్కఁగాను
యియ్యకొన వే మోయి యెందాఁకనూ
యియ్యెడ నందరితో నీ కేకతా లాడనే పట్టె
అయ్యో నిన్ను నిష్ణూరము లాడ నేర నోయీ
(॥ఇట్టె॥)
కంకి నేసి రతులను కాఁగిటఁ గూడితి నిన్ను
యింకాఁ దనియ వే మోయి యెందాఁకను
అంకెల శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
సంకె లేదు వురుముపై సత మైతి నోయి
(||pallavi||)
iṭṭĕ vīḍĕ maṁdugovu yĕṁdām̐kānu
paṭṭabagale vachchidi parāgem̐ṭi koyi
(||iṭṭĕ||)
kaṁṭigi niddura rāga kāsuguṁdāna nīrāga
yiṁṭigi rā ve moyi yĕṁdām̐kanū
jaṁṭa lainasadulado jāṇadanā lāḍam̐ baṭṭĕ
vĕṁṭane tiruga kanuveḽa gāna noyī
(||iṭṭĕ||)
nĕyyamuna viṁdu sĕppi ne nīgu mŏkkam̐gānu
yiyyagŏna ve moyi yĕṁdām̐kanū
yiyyĕḍa naṁdarido nī kegadā lāḍane paṭṭĕ
ayyo ninnu niṣhṇūramu lāḍa nera noyī
(||iṭṭĕ||)
kaṁki nesi radulanu kām̐giḍam̐ gūḍidi ninnu
yiṁkām̐ daniya ve moyi yĕṁdām̐kanu
aṁkĕla śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
saṁkĕ ledu vurumubai sada maidi noyi