Itte vachchemgaani yee vanageligim boyi

ఇట్టె వచ్చేఁగాని యీ వనకేలికిఁ బోయి
Language

(॥పల్లవి॥)
ఇట్టె వచ్చేఁగాని యీ వనకేలికిఁ బోయి
నెట్టన నాడనుండేది నిమిషమే సుమ్మీ

(॥ఇట్టె॥)
మఱవకుమీ నాపై మన్ననా నే-
నెఱఁగ కేమనినా నిముడుకొమ్మీ
గుఱిగా నాయుంగరమే కోరి యెప్పుడుఁ బెట్టుమీ
మఱి నాచెలులను నామారుగాఁ జూడుమీ

(॥ఇట్టె॥)
తలఁచుమీ నామీఁది తగులాయమూ నా-
మెలుపుఁబాయము నీకే మీఁదుసుమ్మీ
సళుపునీపేరు నాకు జపముసుమ్మీ యీ-
యలరులఁబంతి నాయాత్మగాఁ జూడుమీ

(॥ఇట్టె॥)
చవి నీతమ్ములమే నాచద్దిసుమ్మీ నేఁ-
బవళించేపానుపే నీపదవిసుమ్మీ
ఇవల శ్రీవేంకటేశ ఇంతలోనే కూడితివి
వివరించ దినమొకవింత ఇదెసుమ్మీ

(||pallavi||)
iṭṭĕ vachchem̐gāni yī vanageligim̐ boyi
nĕṭṭana nāḍanuṁḍedi nimiṣhame summī

(||iṭṭĕ||)
maṟavagumī nābai mannanā ne-
nĕṟam̐ga kemaninā nimuḍugŏmmī
guṟigā nāyuṁgarame kori yĕppuḍum̐ bĕṭṭumī
maṟi nāsĕlulanu nāmārugām̐ jūḍumī

(||iṭṭĕ||)
talam̐sumī nāmīm̐di tagulāyamū nā-
mĕlubum̐bāyamu nīge mīm̐dusummī
saḽubunīberu nāgu jabamusummī yī-
yalarulam̐baṁti nāyātmagām̐ jūḍumī

(||iṭṭĕ||)
savi nīdammulame nāsaddisummī nem̐-
bavaḽiṁchebānube nībadavisummī
ivala śhrīveṁkaḍeśha iṁtalone kūḍidivi
vivariṁcha dinamŏgaviṁta idĕsummī