Itte tappulemchenamte nemta ledu

ఇట్టె తప్పులెంచేనంటే నెంత లేదు
Language

(॥పల్లవి॥)
ఇట్టె తప్పులెంచేనంటే నెంత లేదు
కట్టు గాచుకొని వూడిగము సేసేఁగాక

(॥ఇట్టె॥)
చిగిరించినట్టు నీవునేసిన చేఁతలకు
యెగసక్కేలాడేనంటే యెంతలేదు
మొగమోడి చేతులెత్తి మొక్కి నీవాడినట్టెల్లా
అగపడి నీకు నే నిల్లాల నైతిఁగాక

(॥ఇట్టె॥)
దిమ్మరివై నీవు గడుఁదిరిగేతిమ్మటలకు
యెమ్మలు మెరసేనంటే యెంత లేదు
సమ్మతించి నీపట్టుకు సాద నే నీచేతను
తమ్ముల మందుక మరఁదల నైతిఁగాక

(॥ఇట్టె॥)
అడియాలమైననీయంగపుమచ్చాలు చూచి
యెడసి కోపించేనంటే యెంత లేదు
అడరి శ్రీవేంకటేశ అన్నిటా నిన్నుఁగూడి
వుడివోక వురముపై నుందానఁగాక

(||pallavi||)
iṭṭĕ tappulĕṁchenaṁṭe nĕṁta ledu
kaṭṭu gāsugŏni vūḍigamu sesem̐gāga

(||iṭṭĕ||)
sigiriṁchinaṭṭu nīvunesina sem̐talagu
yĕgasakkelāḍenaṁṭe yĕṁtaledu
mŏgamoḍi sedulĕtti mŏkki nīvāḍinaṭṭĕllā
agabaḍi nīgu ne nillāla naidim̐gāga

(||iṭṭĕ||)
dimmarivai nīvu gaḍum̐dirigedimmaḍalagu
yĕmmalu mĕrasenaṁṭe yĕṁta ledu
sammadiṁchi nībaṭṭugu sāda ne nīsedanu
tammula maṁduga maram̐dala naidim̐gāga

(||iṭṭĕ||)
aḍiyālamainanīyaṁgabumachchālu sūsi
yĕḍasi kobiṁchenaṁṭe yĕṁta ledu
aḍari śhrīveṁkaḍeśha anniḍā ninnum̐gūḍi
vuḍivoga vuramubai nuṁdānam̐gāga