Itte raamgadaraa yimtilonigi

ఇట్టె రాఁగదరా యింటిలోనికి
Language

(॥పల్లవి॥)
ఇట్టె రాఁగదరా యింటిలోనికి
వుట్టిపడి బిగియఁగ నొద్దురా ఇఁకను

(॥॥)
జవ్వనపాయమువారు చలమునఁ బెనఁగితే
రవ్వలై వలపులు మేరలు మీరును
పువ్వువంటిదాన నేను పొరుగున నుండి నీవు
వువ్విళ్లూర నింత సేయవొద్దురా నీవు

(॥॥)
ప్రేమగలుగువారు బీరములు చూపితేను
దోమటితమకములు చూరుకెక్కును
కామించినదాన నేను ఘనుఁడ విన్నిటా నీవు
వోముచు గుట్టున నవ్వనొద్దురా ఇపుడు

(॥॥)
ఆలుమగఁడైనవారు ఆసల నూరకుండితే
చాలుకొన్న తరితీపు సందడించును
మేలిమి శ్రీ వేంకటేశ మెచ్చి నన్ను నేలితివి
వోలవేసి కొసరఁగనొద్దురా ఇఁకను

(||pallavi||)
iṭṭĕ rām̐gadarā yiṁṭilonigi
vuṭṭibaḍi bigiyam̐ga nŏddurā im̐kanu

(||||)
javvanabāyamuvāru salamunam̐ bĕnam̐gide
ravvalai valabulu meralu mīrunu
puvvuvaṁṭidāna nenu pŏruguna nuṁḍi nīvu
vuvviḽlūra niṁta seyavŏddurā nīvu

(||||)
premagaluguvāru bīramulu sūbidenu
domaḍidamagamulu sūrugĕkkunu
kāmiṁchinadāna nenu ghanum̐ḍa vinniḍā nīvu
vomusu guṭṭuna navvanŏddurā ibuḍu

(||||)
ālumagam̐ḍainavāru āsala nūraguṁḍide
sālugŏnna taridību saṁdaḍiṁchunu
melimi śhrī veṁkaḍeśha mĕchchi nannu nelidivi
volavesi kŏsaram̐ganŏddurā im̐kanu