Itte poddu gadabee nemta mohamo

ఇట్టే పొద్దు గడపీ నెంత మోహమో
Language

(॥పల్లవి॥)
ఇట్టే పొద్దు గడపీ నెంత మోహమో
పట్టి యేకాంతము లాడీ పై నెంత మోహమో

(॥ఇట్టే॥)
పొలఁతి ని న్నంపు తానే పుక్కిటివీడెపు చద్ది
యెలమిఁ బెట్టి న దిది యెంత మోహమో
చెలఁగి తాఁ గప్పుకొన్నచెంగావి దుప్పటము
నిలువుఁగాసె వోసెను నీ కిదెంత మోహమో

(॥ఇట్టే॥)
నిన్నుఁ బొమ్మనఁగ లేక నిలుచుండి కౌఁగిలించి
యెన్నికగా మోవి యిచ్చె నెంత మోహమో
కన్నులఁ దప్పక చూచి కంటసరి మెడలోఁబెట్టి
పన్నితలవంచుకొన్నభావమెంత మోహమో

(॥ఇట్టే॥)
పొంచి తనచెవి తట్టుపుణుఁగు నీ చెక్కులను
ఇంచు కించుకే చమరె నెంత మోహమో
కొంచక శ్రీవేంకటేశ కోమలి గూడితి విట్టే
ముంచి వేగమే రమ్మని మొక్కె నెంత మోహమో

(||pallavi||)
iṭṭe pŏddu gaḍabī nĕṁta mohamo
paṭṭi yegāṁtamu lāḍī pai nĕṁta mohamo

(||iṭṭe||)
pŏlam̐ti ni nnaṁpu tāne pukkiḍivīḍĕbu saddi
yĕlamim̐ bĕṭṭi na didi yĕṁta mohamo
sĕlam̐gi tām̐ gappugŏnnasĕṁgāvi duppaḍamu
niluvum̐gāsĕ vosĕnu nī kidĕṁta mohamo

(||iṭṭe||)
ninnum̐ bŏmmanam̐ga lega nilusuṁḍi kaum̐giliṁchi
yĕnnigagā movi yichchĕ nĕṁta mohamo
kannulam̐ dappaga sūsi kaṁṭasari mĕḍalom̐bĕṭṭi
pannidalavaṁchugŏnnabhāvamĕṁta mohamo

(||iṭṭe||)
pŏṁchi tanasĕvi taṭṭubuṇum̐gu nī sĕkkulanu
iṁchu kiṁchuge samarĕ nĕṁta mohamo
kŏṁchaga śhrīveṁkaḍeśha komali gūḍidi viṭṭe
muṁchi vegame rammani mŏkkĕ nĕṁta mohamo