Itte po dhara nevvarigi | taam

ఇట్టె పో ధర నెవ్వరికి । తాఁ
Language

(॥పల్లవి॥)
ఇట్టె పో ధర నెవ్వరికి । తాఁ
బెట్టిన మమతే పెడకొలి మవును

(॥ఇట్టె॥)
తనియనికోర్కులు తరుణి వెంచఁగ
మనసే యెడపై మలగొనెను
తనుఁ దా నందునె తడఁబడి ముందర
వెనకయు నెఱఁగక వెరగులు వడెను

(॥ఇట్టె॥)
తలిరుఁబోఁడి పతిఁ దలఁచఁగఁ దలఁచఁగఁ
బులక లమ్ములై పొదిగొనెను
నిలువున నందుల నిబిడపుసందడిఁ
దొలఁగరాక తోదోపులఁ బడెను

(॥ఇట్టె॥)
కాఁగిట శ్రీవేంకటపతిఁ గూడఁగ -
నాగనియాఁకై యలవడెను
చేఁగచిగురుతనచేఁతే యిటులై
రాఁగినవలపుల రాయిడిపడెను

(||pallavi||)
iṭṭĕ po dhara nĕvvarigi | tām̐
bĕṭṭina mamade pĕḍagŏli mavunu

(||iṭṭĕ||)
taniyanigorgulu taruṇi vĕṁcham̐ga
manase yĕḍabai malagŏnĕnu
tanum̐ dā naṁdunĕ taḍam̐baḍi muṁdara
vĕnagayu nĕṟam̐gaga vĕragulu vaḍĕnu

(||iṭṭĕ||)
talirum̐bom̐ḍi padim̐ dalam̐sam̐gam̐ dalam̐sam̐gam̐
bulaga lammulai pŏdigŏnĕnu
niluvuna naṁdula nibiḍabusaṁdaḍim̐
dŏlam̐garāga todobulam̐ baḍĕnu

(||iṭṭĕ||)
kām̐giḍa śhrīveṁkaḍabadim̐ gūḍam̐ga -
nāganiyām̐kai yalavaḍĕnu
sem̐gasigurudanasem̐te yiḍulai
rām̐ginavalabula rāyiḍibaḍĕnu