ఇట్టే పిలిపించవయ్యా ఇందరముఁ జూచేము
(॥పల్లవి॥)
ఇట్టే పిలిపించవయ్యా ఇందరముఁ జూచేము
గుట్టు సేసి మాముందర కొంచకు నీవింకను
(॥॥)
యేమనిచెప్పి యంపెనో ఇంతి నీకుఁ జెలులచే
నీమోమునఁ గళలు నిండుకొనెను
ఆముకొని చెలులతో నాడేవు యేకాంతలు
ప్రేమము నీకాపెమీఁదఁ బెరుగఁగఁబోలును
(॥॥)
ఆనవా లేమి యంపెనొ యప్పటిని యాకె నీకు
ఆనుక పిడికిలి గొప్పయి వున్నది
పానుపుపై నేఁడిదేపనై కాచుకవున్నాఁడవు
తానకపు వలపులు తగులఁగఁబోలును
(॥॥)
ఆస యేమి వెట్టెంపెనో అలమేలుమంగ నీకు
సేసవెట్టుకున్నాఁడపు శ్రీవేంకటేశ
పోసరించి మమ్ముఁ గూడి పొందు లాపెవి చెప్పేవు
లాసి నీవుర మాపెకు లంకెలుగా బోలును
(||pallavi||)
iṭṭe pilibiṁchavayyā iṁdaramum̐ jūsemu
guṭṭu sesi māmuṁdara kŏṁchagu nīviṁkanu
(||||)
yemanisĕppi yaṁpĕno iṁti nīgum̐ jĕlulase
nīmomunam̐ gaḽalu niṁḍugŏnĕnu
āmugŏni sĕlulado nāḍevu yegāṁtalu
premamu nīgābĕmīm̐dam̐ bĕrugam̐gam̐bolunu
(||||)
ānavā lemi yaṁpĕnŏ yappaḍini yāgĕ nīgu
ānuga piḍigili gŏppayi vunnadi
pānububai nem̐ḍidebanai kāsugavunnām̐ḍavu
tānagabu valabulu tagulam̐gam̐bolunu
(||||)
āsa yemi vĕṭṭĕṁpĕno alamelumaṁga nīgu
sesavĕṭṭugunnām̐ḍabu śhrīveṁkaḍeśha
posariṁchi mammum̐ gūḍi pŏṁdu lābĕvi sĕppevu
lāsi nīvura mābĕgu laṁkĕlugā bolunu