Itte nem dappaga sooda nemtadaananu

ఇట్టె నేఁ దప్పక చూడ నెంతదానను
Language

(॥పల్లవి॥)
ఇట్టె నేఁ దప్పక చూడ నెంతదానను
పట్టి నీతోఁ బంత మాడి పని గొందువా

(॥ఇట్టె॥)
పాటించి యిచ్చినమాఁటపట్టుకే నిన్నంటిఁ గాక
యీటున నీతోఁ బెనఁగ నెంతదానము
వాఁట మైన వలపులే వాసి రేఁచెఁ గాక నన్ను
వేఁట వెట్టి నిన్ను నింత వేసరింతునా

(॥ఇట్టె॥)
కదిసి చెప్పేకతకుఁ గాళ్లడిగితిఁ గాక
యెదురుమాటాడ నీతో నెందదానను
మొదల నా మొగమోటె మొక్కించెఁ గాక నీకు
యిదివో నిన్నుఁ దగిలి యింత సేతునా

(॥ఇట్టె॥)
సందడిఁ గాఁగిలించఁగా సంతోషించితిఁ గాక
యిందరిలో నిన్ను నవ్వు నెంతదాననూ
అంది శ్రీవెంకటేశుఁడ అట్టె నన్నుఁ గూడితివి
పొందుకు మెచ్చే కాక పోనీ కిట్టె వుందునా

(||pallavi||)
iṭṭĕ nem̐ dappaga sūḍa nĕṁtadānanu
paṭṭi nīdom̐ baṁta māḍi pani gŏṁduvā

(||iṭṭĕ||)
pāḍiṁchi yichchinamām̐ṭabaṭṭuge ninnaṁṭim̐ gāga
yīḍuna nīdom̐ bĕnam̐ga nĕṁtadānamu
vām̐ṭa maina valabule vāsi rem̐sĕm̐ gāga nannu
vem̐ṭa vĕṭṭi ninnu niṁta vesariṁtunā

(||iṭṭĕ||)
kadisi sĕppegadagum̐ gāḽlaḍigidim̐ gāga
yĕdurumāḍāḍa nīdo nĕṁdadānanu
mŏdala nā mŏgamoḍĕ mŏkkiṁchĕm̐ gāga nīgu
yidivo ninnum̐ dagili yiṁta sedunā

(||iṭṭĕ||)
saṁdaḍim̐ gām̐giliṁcham̐gā saṁtoṣhiṁchidim̐ gāga
yiṁdarilo ninnu navvu nĕṁtadānanū
aṁdi śhrīvĕṁkaḍeśhum̐ḍa aṭṭĕ nannum̐ gūḍidivi
pŏṁdugu mĕchche kāga ponī kiṭṭĕ vuṁdunā