ఇట్టె నన్నుఁ గరుణించి యీడేర్తు గాక
(॥పల్లవి॥)
ఇట్టె నన్నుఁ గరుణించి యీడేర్తు గాక
తొట్టుకొన్న సవతుల తొడుసులేల
(॥ఇట్టె॥)
నమ్మించి వద్ద నీవు నాకుఁ గలిగుండఁగాను
పమ్మినట్టి విరహపు భయ మేల
సమ్మతించి యన్నిటాను చనవిచ్చియుండఁగాను
చిమ్ములఁ జెక్కిటిచేతి చింతలేల
(॥ఇట్టె॥)
మనసిచ్చి నీవు నన్ను మన్నించియుండఁగాను
ఘనమైన కాంక్షల కడమేల
ననుపున నీవు నాతో నవ్వులు నవ్వఁగాను
యెనసి చెలులచేతియెడమాట లేల
(॥ఇట్టె॥)
కూడి నీవు నన్ను నిట్టె కొంగువట్టుకుండఁగాను
ఆడుకోలుమాటలలో ఆరడేల
నీడల శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను
మేడెపురతు లబ్బెను మేకు లింకానేల
(||pallavi||)
iṭṭĕ nannum̐ garuṇiṁchi yīḍerdu gāga
tŏṭṭugŏnna savadula tŏḍusulela
(||iṭṭĕ||)
nammiṁchi vadda nīvu nāgum̐ galiguṁḍam̐gānu
pamminaṭṭi virahabu bhaya mela
sammadiṁchi yanniḍānu sanavichchiyuṁḍam̐gānu
simmulam̐ jĕkkiḍisedi siṁtalela
(||iṭṭĕ||)
manasichchi nīvu nannu manniṁchiyuṁḍam̐gānu
ghanamaina kāṁkṣhala kaḍamela
nanubuna nīvu nādo navvulu navvam̐gānu
yĕnasi sĕlulasediyĕḍamāḍa lela
(||iṭṭĕ||)
kūḍi nīvu nannu niṭṭĕ kŏṁguvaṭṭuguṁḍam̐gānu
āḍugolumāḍalalo āraḍela
nīḍala śhrī veṁkaḍeśha ne nalamelumaṁganu
meḍĕburadu labbĕnu megu liṁkānela