Itte nannelidivani yeegedo ne vinnavimche

ఇట్టే నన్నేలితివని యీకెతో నే విన్నవించే
Language

(॥పల్లవి॥)
ఇట్టే నన్నేలితివని యీకెతో నే విన్నవించే
చుట్టమవైన నీతో జోడాయ మీ వలపు

(॥ఇట్టే॥)
నీకుఁగానే పూనుకొని నేరుపుమాట లాడఁగా
యీకె నీ దేవులని నే మెరిఁగితిమి
చేకొని నీవుంగరము చేతఁ బెట్టుకుండఁగాను
సాకిరి దెలుపనేల సంగతాయ వలపు

(॥ఇట్టె॥)
నీవు వూసిన కస్తూరి నెలఁతమేన నుండఁగా
... ... ... ...
దేవర గురుతులెల్లాఁ తెలిసితిమి
భావ మేర్పరచనేల పచ్చిదేరె వలపు

(॥ఇట్టె॥)
నెలఁత పుక్కిట నిట్టె నీవు తమ్ముల మిడఁగా
కలసిన నీపొందులు కనుఁగొంటిమి
యెలమి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
నిలుకడలై మీకు నెరవేరె వలపు

(||pallavi||)
iṭṭe nannelidivani yīgĕdo ne vinnaviṁche
suṭṭamavaina nīdo joḍāya mī valabu

(||iṭṭe||)
nīgum̐gāne pūnugŏni nerubumāḍa lāḍam̐gā
yīgĕ nī devulani ne mĕrim̐gidimi
segŏni nīvuṁgaramu sedam̐ bĕṭṭuguṁḍam̐gānu
sāgiri dĕlubanela saṁgadāya valabu

(||iṭṭĕ||)
nīvu vūsina kastūri nĕlam̐tamena nuṁḍam̐gā
... ... ... ...
devara gurudulĕllām̐ tĕlisidimi
bhāva merbarasanela pachchiderĕ valabu

(||iṭṭĕ||)
nĕlam̐ta pukkiḍa niṭṭĕ nīvu tammula miḍam̐gā
kalasina nībŏṁdulu kanum̐gŏṁṭimi
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
nilugaḍalai mīgu nĕraverĕ valabu