Itte naavemu soosi yemi navvevu

ఇట్టె నావెూము చూచి యేమి నవ్వేవు
Language

(॥పల్లవి॥)
ఇట్టె నావెూము చూచి యేమి నవ్వేవు
చుట్టమవై వూరికెల్లాఁ జూపట్టినవాఁడవు

(॥॥)
ఆసపడేవారి నెంత అలయించేవు పెండ్లి
సేసుకోరాదాయేల సిగ్గువడేవు
దోసముగా దెందరైన దొడ్డిఁ బెట్టుకొనవచ్చు
బేసబెల్లి రేపల్లెఁ బెరిగినవాఁడవు

(॥॥)
తోడనే మాటాడేవారిఁ దోయనేల సరసముఁ
లాడరాదా యేఁటికి నీవండుకాచేవు
వాడికగా వలపువల్లెలు వేయఁ గవచ్చు
కోడెల నావులఁ గాచేగొల్లమందవాఁడవు

(॥॥)
ననిచి చుట్టాలై మొక్కినవారిఁ గాఁగిలించుఁ-
కొనరాదా మరియేమి గుట్టునేనేవు
పెనఁగులాడఁగవచ్చు బెట్టుగా శ్రీవేంకటేశ
యెనసితి గోవర్దనమెత్తినట్టివాఁడవు

(||pallavi||)
iṭṭĕ nāvĕూmu sūsi yemi navvevu
suṭṭamavai vūrigĕllām̐ jūbaṭṭinavām̐ḍavu

(||||)
āsabaḍevāri nĕṁta alayiṁchevu pĕṁḍli
sesugorādāyela sigguvaḍevu
dosamugā dĕṁdaraina dŏḍḍim̐ bĕṭṭugŏnavachchu
besabĕlli reballĕm̐ bĕriginavām̐ḍavu

(||||)
toḍane māḍāḍevārim̐ doyanela sarasamum̐
lāḍarādā yem̐ṭigi nīvaṁḍugāsevu
vāḍigagā valabuvallĕlu veyam̐ gavachchu
koḍĕla nāvulam̐ gāsegŏllamaṁdavām̐ḍavu

(||||)
nanisi suṭṭālai mŏkkinavārim̐ gām̐giliṁchum̐-
kŏnarādā mariyemi guṭṭunenevu
pĕnam̐gulāḍam̐gavachchu bĕṭṭugā śhrīveṁkaḍeśha
yĕnasidi govardanamĕttinaṭṭivām̐ḍavu