Itte naagu sibbidayyee nemee nanamjaalanu

ఇట్టె నాకు సిబ్బితయ్యీ నేమీ ననఁజాలను
Language

(॥పల్లవి॥)
ఇట్టె నాకు సిబ్బితయ్యీ నేమీ ననఁజాలను
దిట్ట వాతనితలఁపుఁ దెలియవే చెలియా

(॥ఇట్టె॥)
తప్పకచూచితేఁ బతి దంట ఇది యనునో
కప్పుర మడిగితేను గబ్బి యనునో
అప్పటిఁ గానుకిచ్చితే నాసపడీ ననునో
చెప్పవే బుద్ది నే నేమి సేతునే వోచెలియా

(॥ఇట్టె॥)
సెలవుల నవ్వితేను చిత్తిణి ఇదెనునో
సొలసి పాదాలొత్తితే జూటరెనునో
వెలయఁగ మొక్కితేను వేసాలది యనునో
నెలకొన్న వెరవులు నేరుపవే చెలియా

(॥ఇట్టె॥)
పచ్చిగా నేఁ జెనకితే పంతగత్తె యనునో
రచ్చలో నేఁ గొసరితే రాఁగయనునో
ఇచ్చట శ్రీవేంకటేశుఁ డింతలో నన్నేలినాఁడు
మచ్చిక నాతని నాతో మరుపవే చెలియా

(||pallavi||)
iṭṭĕ nāgu sibbidayyī nemī nanam̐jālanu
diṭṭa vādanidalam̐pum̐ dĕliyave sĕliyā

(||iṭṭĕ||)
tappagasūsidem̐ badi daṁṭa idi yanuno
kappura maḍigidenu gabbi yanuno
appaḍim̐ gānugichchide nāsabaḍī nanuno
sĕppave buddi ne nemi sedune vosĕliyā

(||iṭṭĕ||)
sĕlavula navvidenu sittiṇi idĕnuno
sŏlasi pādālŏttide jūḍarĕnuno
vĕlayam̐ga mŏkkidenu vesāladi yanuno
nĕlagŏnna vĕravulu nerubave sĕliyā

(||iṭṭĕ||)
pachchigā nem̐ jĕnagide paṁtagattĕ yanuno
rachchalo nem̐ gŏsaride rām̐gayanuno
ichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nannelinām̐ḍu
machchiga nādani nādo marubave sĕliyā