ఇట్టె నాపెఁ జేసితి విఁ(విం?)తమోహము
(॥పల్లవి॥)
ఇట్టె నాపెఁ జేసితి విఁ(విం?)తమోహము
నెట్టనఁ దారుకాణాయ నీకు నాకు మోహము
(॥ట్టె॥)
చేయఁ జేయ నేస్తములఁ జేగలెక్కు మోహము
పాయక కాచుకుండితేఁ బదనెక్కు మోహము
చాయలాను సన్నలాను చవులుట్టు మోహము
వేయువేయు వినయాల వేడుకలౌ మోహము
(॥ట్టె॥)
కుమ్మరింపుఁజూపుల గుదిగొను మోహము
సమ్మతించి పెనఁగితే జడిగొను మోహము
దిమ్మురేఁగఁ జెనకితే తీపులెక్కు మోహము
పమ్మినసరసములఁ బచ్చిదేరు మోహము
(॥ట్టె॥)
కూడఁగూడఁ గాఁగిటిలోఁ గొనసాగు మోహము
జోడై నరతులనుఁ జుట్టుకొను మోహము
వీడనియలమేల్మమంగవిభుఁడ శ్రీవేంకటేశ
వాడికనీసతులకు వరుసాయ మోహము
(||pallavi||)
iṭṭĕ nābĕm̐ jesidi vim̐(viṁ?)tamohamu
nĕṭṭanam̐ dārugāṇāya nīgu nāgu mohamu
(||ṭṭĕ||)
seyam̐ jeya nestamulam̐ jegalĕkku mohamu
pāyaga kāsuguṁḍidem̐ badanĕkku mohamu
sāyalānu sannalānu savuluṭṭu mohamu
veyuveyu vinayāla veḍugalau mohamu
(||ṭṭĕ||)
kummariṁpum̐jūbula gudigŏnu mohamu
sammadiṁchi pĕnam̐gide jaḍigŏnu mohamu
dimmurem̐gam̐ jĕnagide tībulĕkku mohamu
pamminasarasamulam̐ bachchideru mohamu
(||ṭṭĕ||)
kūḍam̐gūḍam̐ gām̐giḍilom̐ gŏnasāgu mohamu
joḍai naradulanum̐ juṭṭugŏnu mohamu
vīḍaniyalamelmamaṁgavibhum̐ḍa śhrīveṁkaḍeśha
vāḍiganīsadulagu varusāya mohamu