Itte naa yaasodamu yemani seppudune

ఇట్టే నా యాసోదము యేమని చెప్పుదునే
Language

(॥పల్లవి॥)
ఇట్టే నా యాసోదము యేమని చెప్పుదునే
నెట్టన విన్నవించరే నేఁడు మీరాతనికి

(॥ఇట్టే॥)
కాంతునిఁ జూచినచూపు గక్కన మనసు చొచ్చి
మంతనాన నిదే నామర్మము రేఁచీనే
వింతగా నాతనిమాట వీనుల విన్నవినికి
బంతినే నారోమకూపములఁ జొచ్చీనే

(॥ఇట్టే॥)
పతితోఁ జేసినపొందు పరగ మేనెల్లా నిండి
సతతము నుప్పతిల్లీఁ జనుఁగవల
అతనిమోవిచవి అట్టె నాలిక మరిగి
రతికెక్కి గుక్కిళ్ళై రసము లుబ్బీనే

(॥ఇట్టే॥)
శ్రీవేంకటేశుకూటమి సిగ్గులెల్లాఁ దొప్పఁదోఁగి
వేవేలు కోరికలై వినోదించీనే
భావించి యాతని తలఁబాలు శిరసుననుండి
తావులపానుపుమీఁద దయిలువారీనే

(||pallavi||)
iṭṭe nā yāsodamu yemani sĕppudune
nĕṭṭana vinnaviṁchare nem̐ḍu mīrādanigi

(||iṭṭe||)
kāṁtunim̐ jūsinasūbu gakkana manasu sŏchchi
maṁtanāna nide nāmarmamu rem̐sīne
viṁtagā nādanimāḍa vīnula vinnavinigi
baṁtine nāromagūbamulam̐ jŏchchīne

(||iṭṭe||)
padidom̐ jesinabŏṁdu paraga menĕllā niṁḍi
sadatamu nuppadillīm̐ janum̐gavala
adanimovisavi aṭṭĕ nāliga marigi
radigĕkki gukkiḽḽai rasamu lubbīne

(||iṭṭe||)
śhrīveṁkaḍeśhugūḍami siggulĕllām̐ dŏppam̐dom̐gi
vevelu korigalai vinodiṁchīne
bhāviṁchi yādani talam̐bālu śhirasunanuṁḍi
tāvulabānubumīm̐da dayiluvārīne