ఇట్టే నా సేవలును యిచ్చేటి నీ యీవులను
(॥పల్లవి॥)
ఇట్టే నా సేవలును యిచ్చేటి నీ యీవులను
గట్టిగా నే నల్పుఁడను ఘనుఁడవు నీవు
(॥ఇట్టే॥)
చిన్ననిమ్మపండే కాదా చేతి కిచ్చి రాజులచే
యెన్న రాని భూములకు నేలికయ్యేది
పన్ని పేరుకొని యొకపద్యము చెప్పేకాదా
సన్నల సర్వార్థములు భాగము గొనేది
(॥ఇట్టే॥)
గవ్వవేసి తూచి కాదా ఘనమైనవజ్రము
చివ్వనను విలువలు చేసుకొనేది
అవ్వల జుట్టెడు తాఁటియాకువాసి వేసి కాదా
యెవ్వరిచే ధనమైనా నిప్పించుకొనేది
(॥ఇట్టే॥)
కసవుకట్టలు వేసి కాదా గోవులచేత
కొసరుచుఁ బాలిప్పించుకొనియెడిది
యెసఁగ శ్రీవేంకటేశ యిట్టే నేను మొక్కి కాదా
పసగల నీ కృపకుఁబాత్రుఁడ నైనది
(||pallavi||)
iṭṭe nā sevalunu yichcheḍi nī yīvulanu
gaṭṭigā ne nalbum̐ḍanu ghanum̐ḍavu nīvu
(||iṭṭe||)
sinnanimmabaṁḍe kādā sedi kichchi rājulase
yĕnna rāni bhūmulagu neligayyedi
panni perugŏni yŏgabadyamu sĕppegādā
sannala sarvārdhamulu bhāgamu gŏnedi
(||iṭṭe||)
gavvavesi tūsi kādā ghanamainavajramu
sivvananu viluvalu sesugŏnedi
avvala juṭṭĕḍu tām̐ṭiyāguvāsi vesi kādā
yĕvvarise dhanamainā nippiṁchugŏnedi
(||iṭṭe||)
kasavugaṭṭalu vesi kādā govulaseda
kŏsarusum̐ bālippiṁchugŏniyĕḍidi
yĕsam̐ga śhrīveṁkaḍeśha yiṭṭe nenu mŏkki kādā
pasagala nī kṛpagum̐bātrum̐ḍa nainadi