ఇట్టె మా గుణము తా నించుకంతా నెరఁగఁడు
(॥పల్లవి॥)
ఇట్టె మా గుణము తా నించుకంతా నెరఁగఁడు
పట్టిన పంతమే కాక బతిమాలేమా
(॥ఇట్టె॥)
తగులువిరి మోహల తా నేడ నే మేడ
నగుతాఁ దనతో నేను నంటు సేసేనా
మగవాఁడు మన్నించితే మగువల మింతే నేము
మొగి విచ్చి తనకు నే మొక్కవచ్చేనా
(॥ఇట్టె॥)
దవ్వుల జాణతనాలు తన కేవి నా కేవి
పువ్వులవాట్లఁ దన్నుఁ బూజ సేసేనా
చివ్వన రమణునితో సిగ్గుగలప్రియురాలఁ
నవ్వలఁ దా నేమనినా నౌఁగాదనేనా
(॥ఇట్టె॥)
తతి శ్రీ వేంకటేశుఁడు(ని?)తమి యెంత నే నెంత
రతికి విచ్చేయఁగాను రాకుమనేనా
యితవైన వాఁడు దాను యిచ్చకురాలను నేను
చతురుఁడై నన్నుఁ గూడె చాలుననేనా
(||pallavi||)
iṭṭĕ mā guṇamu tā niṁchugaṁtā nĕram̐gam̐ḍu
paṭṭina paṁtame kāga badimālemā
(||iṭṭĕ||)
taguluviri mohala tā neḍa ne meḍa
nagudām̐ danado nenu naṁṭu sesenā
magavām̐ḍu manniṁchide maguvala miṁte nemu
mŏgi vichchi tanagu ne mŏkkavachchenā
(||iṭṭĕ||)
davvula jāṇadanālu tana kevi nā kevi
puvvulavāṭlam̐ dannum̐ būja sesenā
sivvana ramaṇunido siggugalapriyurālam̐
navvalam̐ dā nemaninā naum̐gādanenā
(||iṭṭĕ||)
tadi śhrī veṁkaḍeśhum̐ḍu(ni?)tami yĕṁta ne nĕṁta
radigi vichcheyam̐gānu rāgumanenā
yidavaina vām̐ḍu dānu yichchagurālanu nenu
sadurum̐ḍai nannum̐ gūḍĕ sālunanenā