Itte karunimchavayyaa yimtinim joosi

ఇట్టే కరుణించవయ్యా యింతినిఁ జూచి
Language

(॥పల్లవి॥)
ఇట్టే కరుణించవయ్యా యింతినిఁ జూచి
దట్టిమాయ వలపులు తమకమువల్లను

(॥॥)
నొసలి కస్తూరిబొట్టు నునుఁజెమటఁ దడిసి
యసలాయ నిన్నుఁ బాసినందువల్లను
వుసురు నూరుపులచే నూఁగఁజొచ్చెఁబయ్యద
వెస నలయించినట్టి విరహమువల్లను

(॥॥)
పూసిన గందపుఁబూఁత పులకలచేఁ జిటిలి
రాసివడెఁ బాసిన రారాఁపువల్లను
వేసటతోఁ బొరలఁగా వీడి వున్నది తురుము
పోసరించినట్టి తలపోఁతలవల్లను

(॥॥)
తట్టుపునుఁగు చెక్కులఁ దతి కాఁకలఁ గరఁగి
వుట్టిపడీ నిన్నుఁ బాసి వున్నవల్లను
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి వింతలోనే
వెట్టదీరిన రతుల వేడుకలవల్లను

(||pallavi||)
iṭṭe karuṇiṁchavayyā yiṁtinim̐ jūsi
daṭṭimāya valabulu tamagamuvallanu

(||||)
nŏsali kastūribŏṭṭu nunum̐jĕmaḍam̐ daḍisi
yasalāya ninnum̐ bāsinaṁduvallanu
vusuru nūrubulase nūm̐gam̐jŏchchĕm̐bayyada
vĕsa nalayiṁchinaṭṭi virahamuvallanu

(||||)
pūsina gaṁdabum̐būm̐ta pulagalasem̐ jiḍili
rāsivaḍĕm̐ bāsina rārām̐puvallanu
vesaḍadom̐ bŏralam̐gā vīḍi vunnadi turumu
posariṁchinaṭṭi talabom̐talavallanu

(||||)
taṭṭubunum̐gu sĕkkulam̐ dadi kām̐kalam̐ garam̐gi
vuṭṭibaḍī ninnum̐ bāsi vunnavallanu
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viṁtalone
vĕṭṭadīrina radula veḍugalavallanu