Itte bramasivumdaana yemaneem daanu

ఇట్టె బ్రమసివుందాన యేమనీఁ దాను
Language

(॥పల్లవి॥)
ఇట్టె బ్రమసివుందాన యేమనీఁ దాను
యెట్టకేలకు నవ్వితి మేమనీఁ దాను

(॥ఇట్టె॥)
మొదలఁ దనపై నేను మోహము సేసినందుకు
యెదురుగుదురుగాను యేమనీఁదాను
పదరక తనకు నేఁ బంతము లిచ్చినందుకు
యిదివో యిందరు మెచ్చ యేమనీ దాను

(॥ఇట్టె॥)
చెంతలఁ జెప్పినట్టెల్లా సేసి మొక్కినయందుకు
యెంతగద్దు తనయాస యేమనీఁదాను
మంతుకెక్క నేఁ దనమాటలు నమ్మినందుకు
ఇంతలోనె వేగిరించి యేమనీఁ దాను

(॥ఇట్టె॥)
కనుసన్న చేసి తన్ను కాఁగిలించుకొన్నందుకు
యెనలేని సంతోసాన యేమనీఁదాను
చనవిచ్చి శ్రీ వేంకటేశ్వరుఁడె తా నన్నుఁగూడె
ఇనుమడితమకాలు యేమనీఁదాను

(||pallavi||)
iṭṭĕ bramasivuṁdāna yemanīm̐ dānu
yĕṭṭagelagu navvidi memanīm̐ dānu

(||iṭṭĕ||)
mŏdalam̐ danabai nenu mohamu sesinaṁdugu
yĕdurugudurugānu yemanīm̐dānu
padaraga tanagu nem̐ baṁtamu lichchinaṁdugu
yidivo yiṁdaru mĕchcha yemanī dānu

(||iṭṭĕ||)
sĕṁtalam̐ jĕppinaṭṭĕllā sesi mŏkkinayaṁdugu
yĕṁtagaddu tanayāsa yemanīm̐dānu
maṁtugĕkka nem̐ danamāḍalu namminaṁdugu
iṁtalonĕ vegiriṁchi yemanīm̐ dānu

(||iṭṭĕ||)
kanusanna sesi tannu kām̐giliṁchugŏnnaṁdugu
yĕnaleni saṁtosāna yemanīm̐dānu
sanavichchi śhrī veṁkaḍeśhvarum̐ḍĕ tā nannum̐gūḍĕ
inumaḍidamagālu yemanīm̐dānu