ఇట్టె ఆదరించరాదా ఇఁకనై నాను
(॥పల్లవి॥)
ఇట్టె ఆదరించరాదా ఇఁకనై నాను
అట్టాయ నిందరిలోన నెట్టన యీ రమణి
(॥ఇట్టె॥)
పట్టెమంచముపై నీవు పవ్వళించి వుండఁగాను
బట్టబయ లాపె వచ్చి పాదాలొత్తీని
గుట్టున నీవది యెఱుఁగుదువో యెఱఁగవో
వెట్టిసేవలు సేసెను వెలఁది యిందాఁకను
(॥ఇట్టె॥)
సందడిఁ బరాకై నీవు చదురంగమాడఁగాను
అంది యీకె చెవిలో నేకాంతమాడీని
విందువలె నీ వవి వింటివో వినవో కాని
మందుల నూరె మగువ యిందాఁకను
(॥ఇట్టె॥)
కొండపై శ్రీవేంకటేశ కొలువై నీ వుండఁగాను
నిండుఁజన్నుల నొత్తీని నిన్ను నాపె
అండనే నన్నేలితివి అది చూచితివో లేదో
బండుసేసెనిన్నిటాను పడఁతి ఇందాఁకను
(||pallavi||)
iṭṭĕ ādariṁcharādā im̐kanai nānu
aṭṭāya niṁdarilona nĕṭṭana yī ramaṇi
(||iṭṭĕ||)
paṭṭĕmaṁchamubai nīvu pavvaḽiṁchi vuṁḍam̐gānu
baṭṭabaya lābĕ vachchi pādālŏttīni
guṭṭuna nīvadi yĕṟum̐guduvo yĕṟam̐gavo
vĕṭṭisevalu sesĕnu vĕlam̐di yiṁdām̐kanu
(||iṭṭĕ||)
saṁdaḍim̐ barāgai nīvu saduraṁgamāḍam̐gānu
aṁdi yīgĕ sĕvilo negāṁtamāḍīni
viṁduvalĕ nī vavi viṁṭivo vinavo kāni
maṁdula nūrĕ maguva yiṁdām̐kanu
(||iṭṭĕ||)
kŏṁḍabai śhrīveṁkaḍeśha kŏluvai nī vuṁḍam̐gānu
niṁḍum̐jannula nŏttīni ninnu nābĕ
aṁḍane nannelidivi adi sūsidivo ledo
baṁḍusesĕninniḍānu paḍam̐ti iṁdām̐kanu