Ittaayam banulu yimka nemanamdu ninnu

ఇట్టాయఁ బనులు యిఁక నేమనందు నిన్ను
Language

(॥పల్లవి॥)
ఇట్టాయఁ బనులు యిఁక నేమనందు నిన్ను
గుట్టు బయలుసేసేవు గుణివంటా నుంటిని

(॥ఇట్టా॥)
మతకము నేరుతుము మాటలాడ నేరుతుము
కతకుఁ గాళ్లడిగితే కడమ నేర
బతిమాలి నే నీకు బానిసనుకున్నాను
రతికిఁ దీసేవు నీవు రాజవంటా నుంటిని

(॥ఇట్టా॥)
నంటు సేయనోపుదుము నగ నీతో నోపుదుము
ముంటికి వాఁడివెట్టఁగ ముందే వోపము
గొంటరినై నే నీకు కుంటెన నడచేనన్నా
జంటల మొక్కవచ్చేవు జాణవంటా నుంటిని

(॥ఇట్టా॥)
వంకలాడనెఱుఁగుదు వలవఁగ నెఱుఁగుదు
తెంకాయలో నీటికి తెరువెఱఁగ
మంకుగొల్లదాననన్నా మన్నించి నన్ను గూడితి
పొంకపు శ్రీవేంకటేశ భోగివంటా నుంటిని

(||pallavi||)
iṭṭāyam̐ banulu yim̐ka nemanaṁdu ninnu
guṭṭu bayalusesevu guṇivaṁṭā nuṁṭini

(||iṭṭā||)
madagamu nerudumu māḍalāḍa nerudumu
kadagum̐ gāḽlaḍigide kaḍama nera
badimāli ne nīgu bānisanugunnānu
radigim̐ dīsevu nīvu rājavaṁṭā nuṁṭini

(||iṭṭā||)
naṁṭu seyanobudumu naga nīdo nobudumu
muṁṭigi vām̐ḍivĕṭṭam̐ga muṁde vobamu
gŏṁṭarinai ne nīgu kuṁṭĕna naḍasenannā
jaṁṭala mŏkkavachchevu jāṇavaṁṭā nuṁṭini

(||iṭṭā||)
vaṁkalāḍanĕṟum̐gudu valavam̐ga nĕṟum̐gudu
tĕṁkāyalo nīḍigi tĕruvĕṟam̐ga
maṁkugŏlladānanannā manniṁchi nannu gūḍidi
pŏṁkabu śhrīveṁkaḍeśha bhogivaṁṭā nuṁṭini