Isumamta panigi yemta sesevu

ఇసుమంత పనికి యెంత సేసేవు
Language

(॥పల్లవి॥)
ఇసుమంత పనికి యెంత సేసేవు
కొసరె నంటానే కొప్పు వట్టేవు

(॥ఇసు॥)
కలిమిగల విభుఁడు కాంతలకుఁ గొలువైతే
చలపట్టి కోపింతురా సారెసారెకు
మొలక చన్నులమీఁద మొసగోరు మోపెనంటా
పలికి నెపమువేసి పరచేవప్పటిని

(॥ఇసు॥)
రతి యెరిఁగినవాఁడు కామలకు నేరుపఁగా
తతిగొని తిట్టుదురా తప్పులు మోపి
చతురతలను మీతో సరిఁ బెనఁగె నంటా
మతకము వేసి నీవు మచ్చరించేవు

(॥ఇసు॥)
శ్రీవేంకటేశ్వరుఁడు చెలులతో నవ్వఁగాను
కావరించి పట్టుదురా కతలు చెప్పి
యీవేళ నీతఁడు నిన్నే ఇచ్చిగించి కూడెనంటా
వావులు చెప్పుచు నీవు వలపించేవు

(||pallavi||)
isumaṁta panigi yĕṁta sesevu
kŏsarĕ naṁṭāne kŏppu vaṭṭevu

(||isu||)
kalimigala vibhum̐ḍu kāṁtalagum̐ gŏluvaide
salabaṭṭi kobiṁturā sārĕsārĕgu
mŏlaga sannulamīm̐da mŏsagoru mobĕnaṁṭā
paligi nĕbamuvesi parasevappaḍini

(||isu||)
radi yĕrim̐ginavām̐ḍu kāmalagu nerubam̐gā
tadigŏni tiṭṭudurā tappulu mobi
saduradalanu mīdo sarim̐ bĕnam̐gĕ naṁṭā
madagamu vesi nīvu machchariṁchevu

(||isu||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu sĕlulado navvam̐gānu
kāvariṁchi paṭṭudurā kadalu sĕppi
yīveḽa nīdam̐ḍu ninne ichchigiṁchi kūḍĕnaṁṭā
vāvulu sĕppusu nīvu valabiṁchevu