ఇసుమంత పని కైన యియ్యకొందును నీ
(॥పల్లవి॥)
ఇసుమంత పని కైన యియ్యకొందును నీ
వసమైనదాన నాకు వంక లాడ వలెనా
(॥ఇసుమంత॥)
మన్నించి నీవు నాతో మాట లాడితిని గాక
సన్న సేసి నిలచుటే చాలదా నాకూ
నన్నుఁ జూచి మరిఁ గొంత నవ్వు నవ్వితిని గాక
వున్నట్టె నావొద్ద నీవు వుండితేనె చాలదా
(॥ఇసుమంత॥)
కరుణించి నీవు నాకాయ మంటితివి గాక
సరిపేరఁ బిలిచిన చాలదా నాకు
మరిగించుకో లేక మంతన మాడేవు గాక
గరిమె నీసొమ్మ నని కైకొంటే చాలదా
(॥ఇసుమంత॥)
ఆదరించి కాఁగిట నీ వలముకొంటివి గాక
సాద నంటా మెచ్చి తిదె చాలదా నాకు
సేదదేరఁ గూడితివి శ్రీవెంకటేశ నీవు
పాదము చాఁచి నన్నుఁ బైకొనుటే చాలదా
(||pallavi||)
isumaṁta pani kaina yiyyagŏṁdunu nī
vasamainadāna nāgu vaṁka lāḍa valĕnā
(||isumaṁta||)
manniṁchi nīvu nādo māḍa lāḍidini gāga
sanna sesi nilasuḍe sāladā nāgū
nannum̐ jūsi marim̐ gŏṁta navvu navvidini gāga
vunnaṭṭĕ nāvŏdda nīvu vuṁḍidenĕ sāladā
(||isumaṁta||)
karuṇiṁchi nīvu nāgāya maṁṭidivi gāga
sariberam̐ bilisina sāladā nāgu
marigiṁchugo lega maṁtana māḍevu gāga
garimĕ nīsŏmma nani kaigŏṁṭe sāladā
(||isumaṁta||)
ādariṁchi kām̐giḍa nī valamugŏṁṭivi gāga
sāda naṁṭā mĕchchi tidĕ sāladā nāgu
sedaderam̐ gūḍidivi śhrīvĕṁkaḍeśha nīvu
pādamu sām̐si nannum̐ baigŏnuḍe sāladā