ఇసుక పాఁతరలు యిద్దరి మీ జవ్వనాలు
(॥పల్లవి॥)
ఇసుక పాఁతరలు యిద్దరి మీ జవ్వనాలు
కొసరకు మనసులో గురి దాఁకీని
(॥॥)
వలపు రేఁచకుమీ వద్దు వద్దు అంతేసి
మెలఁగి కలి ముదిరి మెడిదయ్యీని
చలము సాదించి నీవు జవరాలిని రతికి
పిలువకు నీమోవి పిప్పిగట్టీని
(॥॥)
జఱసి చన్నులంటకు చాలుఁ జాలు మీఁద మీఁద
మఱి వుప్పు చింది యినుమడయ్యీని
కఱకరింపుచు నింతి కందువకు రమ్మని
చెఱఁగువట్టి తియ్యకు చెమరించీని
(॥॥)
ఱట్టుగా నవ్వకుమీ ఆఱడి నిట్టే కూడితివి
యిట్టే గోర గీరితే నేరయ్యీని
నెట్టినఁ బంతమాడకు నీవు శ్రీవేంకటేశుఁడ
చుట్టిపు సరసములు సూడువట్టీసి
(||pallavi||)
isuga pām̐taralu yiddari mī javvanālu
kŏsaragu manasulo guri dām̐kīni
(||||)
valabu rem̐sagumī vaddu vaddu aṁtesi
mĕlam̐gi kali mudiri mĕḍidayyīni
salamu sādiṁchi nīvu javarālini radigi
piluvagu nīmovi pippigaṭṭīni
(||||)
jaṟasi sannulaṁṭagu sālum̐ jālu mīm̐da mīm̐da
maṟi vuppu siṁdi yinumaḍayyīni
kaṟagariṁpusu niṁti kaṁduvagu rammani
sĕṟam̐guvaṭṭi tiyyagu sĕmariṁchīni
(||||)
ṟaṭṭugā navvagumī āṟaḍi niṭṭe kūḍidivi
yiṭṭe gora gīride nerayyīni
nĕṭṭinam̐ baṁtamāḍagu nīvu śhrīveṁkaḍeśhum̐ḍa
suṭṭibu sarasamulu sūḍuvaṭṭīsi