ఇరువు దెలియలేరు యింతేసి జాణలు మీరు
(॥పల్లవి॥)
ఇరువు దెలియలేరు యింతేసి జాణలు మీరు
యిరుగుపొరుగువారు యింకా మిమ్ము నగరా
(॥ఇర॥)
సంకె లేక యాపెతోడ సరసములాడఁగాను
యింక నేఁ గొసరుదునా యేడసుద్దులు
వంకలొత్తి మీరాతని వలపు చెల్లఁబెట్టేరు
మంకుల వోచెలులాల మరి మిమ్ము నగరొ
(॥ఇర॥)
మోము చూడఁగా నాకెచే మొక్కించ నాకు రాఁగాఁ
నేమని నే మాటలాడేనేడ సుద్దులు
యీమాటలకే మీరు యిచ్చకములాడేరు
దోమటి మీతగవుకు దూరి మిమ్ము నగరా
(॥ఇర॥)
ఆపె నన్ను సరిచేసి అట్టె కాఁగిటించుకోఁగాఁ
నేపనులునిఁకనేల యేడ సుద్దులు
చేపట్టి నన్ను వింతతో శ్రీవేంకటేశుఁడు గూడె
యీపనికొడఁబరచేరిట్టె మిమ్ము నగరా
(||pallavi||)
iruvu dĕliyaleru yiṁtesi jāṇalu mīru
yirugubŏruguvāru yiṁkā mimmu nagarā
(||ira||)
saṁkĕ lega yābĕdoḍa sarasamulāḍam̐gānu
yiṁka nem̐ gŏsarudunā yeḍasuddulu
vaṁkalŏtti mīrādani valabu sĕllam̐bĕṭṭeru
maṁkula vosĕlulāla mari mimmu nagarŏ
(||ira||)
momu sūḍam̐gā nāgĕse mŏkkiṁcha nāgu rām̐gām̐
nemani ne māḍalāḍeneḍa suddulu
yīmāḍalage mīru yichchagamulāḍeru
domaḍi mīdagavugu dūri mimmu nagarā
(||ira||)
ābĕ nannu sarisesi aṭṭĕ kām̐giḍiṁchugom̐gām̐
nebanulunim̐kanela yeḍa suddulu
sebaṭṭi nannu viṁtado śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
yībanigŏḍam̐baraseriṭṭĕ mimmu nagarā