Iruvamkala neegu nimdaramu nunnaaramu

ఇరువంకల నీకు నిందరము నున్నారము
Language

(॥పల్లవి॥)
ఇరువంకల నీకు నిందరము నున్నారము
తెరమరఁగునవ్వులు తెలుసుకోవయ్యా

(॥ఇరు॥)
వేడుకకుఁ దోడువచ్చి వెనకతియ్యఁగరాదు
వాడికకుఁ జోటిచ్చి వద్దనరాదు
పాడిచెప్పేనని వచ్చి పక్షపాత మాడరాదు
తాడుపై తపసు నీవే తలఁచుకోవయ్యా

(॥ఇరు॥)
అట్టె తా పూఁటవడి అరవననఁగరాదు
పట్టి చవిగొంటా రోతపడఁగరాదు
చుట్టరికము సేయుచు సూడువట్టఁగరాదు
చట్టురాతినారిది విచారించుకోవయ్యా

(॥ఇరు॥)
సేసవెట్టి పెఁడ్లాడి సిగ్గులువడగఁరాదు
బాసగెని(లి?) చినమీఁద బద్దనరాదు
యీసుదీర శ్రీవేంకటేశ మమ్ము నేలితివి
వేసినముడియ ఇది విడువకువయ్యా

(||pallavi||)
iruvaṁkala nīgu niṁdaramu nunnāramu
tĕramaram̐gunavvulu tĕlusugovayyā

(||iru||)
veḍugagum̐ doḍuvachchi vĕnagadiyyam̐garādu
vāḍigagum̐ joḍichchi vaddanarādu
pāḍisĕppenani vachchi pakṣhabāda māḍarādu
tāḍubai tabasu nīve talam̐sugovayyā

(||iru||)
aṭṭĕ tā pūm̐ṭavaḍi aravananam̐garādu
paṭṭi savigŏṁṭā rodabaḍam̐garādu
suṭṭarigamu seyusu sūḍuvaṭṭam̐garādu
saṭṭurādināridi visāriṁchugovayyā

(||iru||)
sesavĕṭṭi pĕm̐ḍlāḍi sigguluvaḍagam̐rādu
bāsagĕni(li?) sinamīm̐da baddanarādu
yīsudīra śhrīveṁkaḍeśha mammu nelidivi
vesinamuḍiya idi viḍuvaguvayyā