Irumona soodivaidi vemamdu ninnu

ఇరుమొన సూదివైతి వేమందు నిన్ను
Language

(॥పల్లవి॥)
ఇరుమొన సూదివైతి వేమందు నిన్ను
తొరలీ సిగ్గులు నీ దొరతనము చూచి

(॥ఇరు॥)
చిగురువంటిమోవిని చేవదేరేవలపులు
మగువ నీకుఁజూపీ మాటలలోనె
తగిలే వప్పటి నన్ను తల రాయి సేసుకొని
నగవు వచ్చీ నాకు నన్ను నిన్నుఁజూచి

(॥ఇరు॥)
పువ్వులవంటి చేతుల పూఁపలవంటి వయసు
జవ్వని నీకుఁ జూపీ సన్నలలోనె
రవ్వగా నన్ను నంటేవు రాజసము చేసుకొని
నివ్వెరగయ్యీ నాకు నీ గుణము చూచి

(॥ఇరు॥)
చక్కెరవంటి మేనఁ జందమామ గుటుకలు
గక్కన నీకింతి చూపీ కాఁగిటిలోన
యెక్కువ శ్రీ వేంకటేశ యిటు నన్నుఁగూడితివి
నెక్కొని వేడుకవుట్టీ నీరతులు చూచి

(||pallavi||)
irumŏna sūdivaidi vemaṁdu ninnu
tŏralī siggulu nī dŏradanamu sūsi

(||iru||)
siguruvaṁṭimovini sevaderevalabulu
maguva nīgum̐jūbī māḍalalonĕ
tagile vappaḍi nannu tala rāyi sesugŏni
nagavu vachchī nāgu nannu ninnum̐jūsi

(||iru||)
puvvulavaṁṭi sedula pūm̐palavaṁṭi vayasu
javvani nīgum̐ jūbī sannalalonĕ
ravvagā nannu naṁṭevu rājasamu sesugŏni
nivvĕragayyī nāgu nī guṇamu sūsi

(||iru||)
sakkĕravaṁṭi menam̐ jaṁdamāma guḍugalu
gakkana nīgiṁti sūbī kām̐giḍilona
yĕkkuva śhrī veṁkaḍeśha yiḍu nannum̐gūḍidivi
nĕkkŏni veḍugavuṭṭī nīradulu sūsi