(॥పల్లవి॥)
ఇరుగుపొరుగువారు యేమందురే
అరసి నీపై వలపు అందరిపై బూతురా
(॥ఇరుగు॥)
నిగ్గుల నీ రమణుఁడు నీతో మాటలాడితేను
యెగ్గులు వేరొకతెపై నేలపెట్టేవే
వొగ్గుచు నిన్నాతఁడు వొడివట్టి తీసితేను
బగ్గన నాపె కొంగు పట్టించేవదేమే
(॥ఇరుగు॥)
తమకించి నిన్నాతఁడు తప్పక చూచితే నెడో
రమణిని దెచ్చి ముందరను దోసేవే
సముకాన కొనగోర సారెనొత్త వచ్చితేను
అమర వేరొకతె మేనటు దాఁకించేవే
(॥ఇరుగు॥)
శ్రీ వేంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడితేను
వావిరి నాపెకు నేల వంతువెట్టేవే
నీ వలమేలుమంగవు నిన్నుర మెక్కించుకొంటే
భూవనితఁ దెచ్చి అట్టే బుజమెక్కించేవే
(||pallavi||)
irugubŏruguvāru yemaṁdure
arasi nībai valabu aṁdaribai būdurā
(||irugu||)
niggula nī ramaṇum̐ḍu nīdo māḍalāḍidenu
yĕggulu verŏgadĕbai nelabĕṭṭeve
vŏggusu ninnādam̐ḍu vŏḍivaṭṭi tīsidenu
baggana nābĕ kŏṁgu paṭṭiṁchevademe
(||irugu||)
tamagiṁchi ninnādam̐ḍu tappaga sūside nĕḍo
ramaṇini dĕchchi muṁdaranu doseve
samugāna kŏnagora sārĕnŏtta vachchidenu
amara verŏgadĕ menaḍu dām̐kiṁcheve
(||irugu||)
śhrī veṁkaḍeśhvarum̐ḍu seri ninnum̐ gūḍidenu
vāviri nābĕgu nela vaṁtuvĕṭṭeve
nī valamelumaṁgavu ninnura mĕkkiṁchugŏṁṭe
bhūvanidam̐ dĕchchi aṭṭe bujamĕkkiṁcheve