ఇరుగుపొరుగువార యీ(లీ?) తగవు వినరమ్మ
(॥పల్లవి॥)
ఇరుగుపొరుగువార యీ(లీ?) తగవు వినరమ్మ
పెరిగి వూరకె నన్నుఁ బెల్లించీ విభుఁడు
(॥ఇరు॥)
పోరచిచెలుల నెల్లా బొమ్మల జంకించీనే
చేరి తనసుద్దులెల్లాఁ జేప్పేరంటాను
నేరుపుతో పచ్చడము నిండాఁ గప్పుకొననేలే
వేరే తనమొయిచేఁతలు వెల్లవిరై నంటాను
(॥ఇరు॥)
సముకాన నందరిలో సన్నులేల సేసీనే
తమితో తనపొందులు తడవేనంటా
జమళి సాకిరి చెప్పేసతులనేల తిట్టీనే
నెమకినఁ దారుకాణ నిజమయ్యీనంటాను
(॥ఇరు॥)
ఇచ్చకము సేసి నన్ను నెంత కాఁగిలించీనే
కచ్చుపెట్టి తనగుట్టు గందీనంటాను
అచ్చపుశ్రీవేంకటేశుఁ డలమేలుమంగపతి
అచ్చలాన నగనేలే అలనైతినంటాను
(||pallavi||)
irugubŏruguvāra yī(lī?) tagavu vinaramma
pĕrigi vūragĕ nannum̐ bĕlliṁchī vibhum̐ḍu
(||iru||)
porasisĕlula nĕllā bŏmmala jaṁkiṁchīne
seri tanasuddulĕllām̐ jepperaṁṭānu
nerubudo pachchaḍamu niṁḍām̐ gappugŏnanele
vere tanamŏyisem̐talu vĕllavirai naṁṭānu
(||iru||)
samugāna naṁdarilo sannulela sesīne
tamido tanabŏṁdulu taḍavenaṁṭā
jamaḽi sāgiri sĕppesadulanela tiṭṭīne
nĕmaginam̐ dārugāṇa nijamayyīnaṁṭānu
(||iru||)
ichchagamu sesi nannu nĕṁta kām̐giliṁchīne
kachchubĕṭṭi tanaguṭṭu gaṁdīnaṁṭānu
achchabuśhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁgabadi
achchalāna naganele alanaidinaṁṭānu