Iravuga neṟumgudu nennigalu

ఇరవుగ నెఱుఁగుదు నెన్నికలు
Language

(॥పల్లవి॥)
ఇరవుగ నెఱుఁగుదు నెన్నికలు
సరికి బేసికిని జంకింతువుగా

(॥ఇరవు॥)
పలుకులు నీతోఁ బచరించఁగా
చెలఁగుచు గయ్యాళిఁ జేతువుగా
కొలువులు తరచుగ గోరి సేయఁగా
చలమరి నని రచ్చల వేతువుగా

(॥ఇరవు॥)
వాసితోడ సేవలు సేయఁగా
ఆసోదకత్తెని యందువుగా
సేసనెట్టి పైఁ జేయి చాఁచఁగా
వేసాలది యని వెలయింతువుగా

(॥ఇరవు॥)
యిట్టె శ్రీవేంకటేశ కూడఁగా
దిట్ట యనుచు సాదింతువుగా
గుట్టున నిటు నిను గోర నంటఁగా
ఱట్టడి యని యాఱడి నవ్వుదుగా

(||pallavi||)
iravuga nĕṟum̐gudu nĕnnigalu
sarigi besigini jaṁkiṁtuvugā

(||iravu||)
palugulu nīdom̐ basariṁcham̐gā
sĕlam̐gusu gayyāḽim̐ jeduvugā
kŏluvulu tarasuga gori seyam̐gā
salamari nani rachchala veduvugā

(||iravu||)
vāsidoḍa sevalu seyam̐gā
āsodagattĕni yaṁduvugā
sesanĕṭṭi paim̐ jeyi sām̐sam̐gā
vesāladi yani vĕlayiṁtuvugā

(||iravu||)
yiṭṭĕ śhrīveṁkaḍeśha kūḍam̐gā
diṭṭa yanusu sādiṁtuvugā
guṭṭuna niḍu ninu gora naṁṭam̐gā
ṟaṭṭaḍi yani yāṟaḍi navvudugā