Iravayi ne meṟimgina vimtaanu | nee

ఇరవయి నే మెఱిఁగిన వింతాను । నీ
Language

(॥పల్లవి॥)
ఇరవయి నే మెఱిఁగిన వింతాను । నీ-
వరుసవంతేకాక వాదించఁదగునా

(॥ఇర॥)
పలుకులతుదనేలే పంతాలు నీపతి-
వలపులమీఁదనే వంచరాదా
నిలుచుండే విదియేమే నీవు నావద్ద నీ-
చలము లక్కడనే సాదించరాదా

(॥ఇర॥)
కన్నులచూపులనేలే కసరులు
నిన్నింతసేయువానిపై నెరపరాదా
నన్నుఁ జుట్టి నీకేలే నాయాలు నీ-
పన్నుగడ లక్కడనే పచరించరాదా

(॥ఇర॥)
చెక్కుల చేతులనేలే సిగ్గులు నీకుఁ
జిక్కినయాతనివద్దఁ జేయరాదా
యిక్కువ శ్రీవేంకటేశుఁడిటు గూడె నన్ను నీ-
మొక్కు లాడ మొక్కి ప్రియములు చెప్పరాదా

(||pallavi||)
iravayi ne mĕṟim̐gina viṁtānu | nī-
varusavaṁtegāga vādiṁcham̐dagunā

(||ira||)
paluguladudanele paṁtālu nībadi-
valabulamīm̐dane vaṁcharādā
nilusuṁḍe vidiyeme nīvu nāvadda nī-
salamu lakkaḍane sādiṁcharādā

(||ira||)
kannulasūbulanele kasarulu
ninniṁtaseyuvānibai nĕrabarādā
nannum̐ juṭṭi nīgele nāyālu nī-
pannugaḍa lakkaḍane pasariṁcharādā

(||ira||)
sĕkkula sedulanele siggulu nīgum̐
jikkinayādanivaddam̐ jeyarādā
yikkuva śhrīveṁkaḍeśhum̐ḍiḍu gūḍĕ nannu nī-
mŏkku lāḍa mŏkki priyamulu sĕpparādā